Fire-Boltt Rise Luxe: ప్రీమియం మెటల్ ఎడిషన్ వాచ్ లను లాంచ్ చేస్తున్న ఫైర్ బోల్ట్.!

HIGHLIGHTS

Fire-Boltt Rise Luxe స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తున్నట్లు ఫైర్ బోల్ట్ అనౌన్స్ చేసింది

స్టెయిన్ లెస్ స్టీల్ ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది

మరో రెండు స్మార్ట్ వాచ్ లను కూడా ఫైర్ బోల్ట్ వరుసగా లాంచ్ చేస్తోంది

ప్రీమియం మెటల్ ఎడిషన్ నుండి కొత్త Fire-Boltt Rise Luxe స్మార్ట్ వాచ్ లను విడుదల చేస్తున్నట్లు ఫైర్ బోల్ట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ లను లేటెస్ట్ ఫీచర్స్ మరియు స్టెయిన్ లెస్ స్టీల్ ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. కేవలం ఈ స్మార్ట్ వాచ్ మాత్రమే కాదు మరో రెండు స్మార్ట్ వాచ్ లను కూడా ఫైర్ బోల్ట్ వరుసగా లాంచ్ చేస్తోంది. అందులో, ఫైర్ బోల్ట్ Royale మరియు Lumos స్మార్ట్ వాచ్ లు ఉన్నాయి. మరి ఫైర్ బోల్ట్ ప్రీమియం మెటల్ సిరీస్ నుండి లాంచ్ చేయబోతున్న రైజ్ లక్స్ స్మార్ట్ వాచ్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దామా.

Fire-Boltt Rise Luxe

ఫైర్ బోల్ట్ రైజ్ లక్స్ స్మార్ట్ వాచ్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ వాచ్ ఫీచర్స్ ను మాత్రం అందించింది. ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్సైట్ నుండి ఈ స్మార్ట్ వాచ్ వివరాలను పూర్తిగా వివరించింది.

ఫైర్ బోల్ట్ రైజ్ లక్స్ స్మార్ట్ వాచ్

ఫైర్ బోల్ట్ రైజ్ లక్స్ స్మార్ట్ వాచ్ 1.85 ఇంచ్ పెద్ద HD డిస్ప్లేని 240 X 280 రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ సింగల్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ను ఇన్ బిల్ట్ స్పీకర్ మరియు మైక్రో ఫోన్ తో కలిగి వుంది. ఈ రైజ్ లక్స్ స్మార్ట్ వాచ్ 123 డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ ను కలిగి ఉంటుంది. అలాగే, ఇందులో ఇన్ బిల్ట్ గేమ్స్ కూడా ఉంటాయి.

Also Read : Instagram Good News: ఇక యాప్ లో డైరెక్ట్ గా Reels డౌన్ లోడ్ చేసుకోవచ్చు.!

ఈ స్మార్ట్ వాచ్ మంచి ప్రీమియం లుక్స్ అందించే స్టెయిన్ లెస్ స్టీల్ బాడీ మరియు గొప్ప డిజైన్ తో వస్తుంది. ఈ వాచ్ లో SpO2 మోనిటర్, స్లీప్ మోనిటర్ మరియు హార్ట్ రేట్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అంతేకాదు, మ్యూజిక్ కంట్రోల్, IP67 వాటర్ రెసిస్టెంట్, వాతావరణ చెకింగ్ మరియు రిమోట్ కెమేరా కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫైర్ బోల్ట్ రైజ్ లక్స్ స్మార్ట్ వాచ్ ను త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ స్మార్ట్ వాచ్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :