boAt Wave Sigma 3 స్మార్ట్ వాచ్ చవక ధరలో బిగ్ డిస్ప్లే మరియు IP67 రేటింగ్ తో వచ్చింది.!

HIGHLIGHTS

చవక ధరలో కొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది బోట్

boAt Wave Sigma 3 వాచ్ లో గొప్ప ఫీచర్లను అందించింది

బిగ్ డిస్ప్లే మరియు IP67 వాటర్ రెసిస్టెంట్ స్మార్ట్ వాచ్ గా తీసుకువచ్చింది

boAt Wave Sigma 3: చవక ధరలో కొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది బోట్. ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను చవక ధరలో బిగ్ డిస్ప్లే మరియు IP67 వాటర్ రెసిస్టెంట్ స్మార్ట్ వాచ్ గా తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ చవక ధరలో విడుదల చేసినా, ఈ వాచ్ లో గొప్ప ఫీచర్లను అందించింది.

boAt Wave Sigma 3: ప్రైస్

బోట్ యొక్క ఈ కోట స్మార్ట్ వాచ్ రూ. 1599 రూపాయల లాంచ్ ధరతో వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు బోట్ అధికారిక వెబ్సైట్ నుండి కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది.

boAt Wave Sigma 3: ఫీచర్లు

బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్ వాచ్ పెద్ద 2.01 ఇంచ్ HD డిస్ప్లే ను కలిగి వుంది. ఈ స్క్రీన్ చాలా సన్నని అంచులతో వస్తుంది. ఈ స్క్రీన్ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు వేక్ జెశ్చర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మ్యాప్ మై ఇండియా యాప్ సహాయంతో ఖచ్చితమైన నావిగేషన్ సపోర్ట్ తో వస్తుంది.

boAt Wave Sigma 3

ఈ బోట్ స్మార్ట్ వాచ్ DIY వాచ్ ఫేస్ స్టూడియో మరియు QR Tray ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ బోట్ కొత్త వాచ్ 700+ యాక్టీవ్ మోడ్స్, డైలీ యాక్టివిటీ ట్రాక్స్ మరియు సెడెంటరీ అలర్ట్స్ తో కూడా వస్తుంది. ఈ వాచ్ IP67 చమట, డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో 40 వేల ధరకే 65 ఇంచ్ QLED Smart Tv పొందండి.!

బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్ వాచ్ లో నోటిఫికేషన్ అలర్ట్స్, క్విక్ రిప్లైస్ మరియు DND Mode తో కూడా వస్తుంది. ఈ బోట్ వాచ్ హార్ట్ రేట్ మోనిటర్, spO2 మోనిటరింగ్ మరియు స్లీప్ మోనిటర్ వంటి హెల్త్ ట్రాకింగ్ సపోర్ట్ లను కూడా కలిగి వుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్, Emergency SOS మరియు లైవ్ స్పోర్ట్స్ అప్డేట్ లను కూడా అందిస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ స్విమ్మింగ్ వంటి వాటర్ స్పోర్ట్ లకు సైతం కూడా సపోర్ట్ చేస్తుందని కూడా బోట్ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :