boAt స్మార్ట్ వాచ్: eSIM సపోర్ట్ తో Lunar Pro LTE స్మార్ట్ వాచ్ తెచ్చింది.!

HIGHLIGHTS

బోట్ eSIM సపోర్ట్ తో కొత్త Lunar Pro LTE స్మార్ట్ వాచ్ తెచ్చింది

గొప్ప డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లను కూడా కలిగి వుంది

ఫోన్ సపోర్ట్ లేకుండానే కాల్స్ మరియు మెసేజిలను అందుకోవచ్చు

ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ eSIM సపోర్ట్ తో కొత్త Lunar Pro LTE స్మార్ట్ వాచ్ తెచ్చింది. ఈ బోట్ స్మార్ట్ వాచ్ ఈసిమ్ సపోర్ట్ తో పాటుగా గొప్ప డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లను కూడా కలిగి వుంది. ఈ వాచ్ రెండు అతిపెద్ద టెలికం కంపెనీల ఈసిమ్ సపోర్ట్ తో వస్తుంది మరియు స్మార్ట్ వాచ్ పరిధిని మరింత పెంచుతుంది. బోట్ సరికొత్తగా తీసుకు వచ్చిన లూనార్ ప్రో లైట్ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

boAt Lunar Pro LTE With eSIM

బోట్ సరికొత్తగా ప్రకటించిన లూనార్ ప్రో లైట్ ఈసిమ్ సపోర్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ధర వివరాలను ఇంకా తెలియపరచ లేదు. అయితే ఈ ఫోన్ ప్రత్యేకతలను మాత్రం వెల్లడించింది. లూనార్ ప్రో లైట్ స్మార్ట్ వాచ్ ఎటువంటి స్మార్ట్ ఫోన్ సపోర్ట్ లేకుండానే కాల్స్ మరియు మెసేజిలను పంపడంతో పాటు అందుకోవచ్చు కూడా.

బోట్ లూనార్ ప్రో లైట్

ఈ స్మార్ట్ వాచ్ ను Jio మరియు ఎయిర్టెల్ రెండు టెలికం కంపెనీల ఈసిమ్ సపోర్ట్ లతో అందించింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ వాచ్ ను జియో భాగస్వామ్యంతో ఈ స్మార్ట్ వాచ్ ను తీసుకు వచ్చినట్లు చెబుతున్నా, కంపెనీ వెబ్సైట్ లో మాత్రం ఎయిర్టెల్ ఈసిమ్ కు కూడా మద్దతు ఉంటుందని తెలిపింది.

Also Read : WhatsApp లో మరొక అద్భుతమైన ఫీచర్ తెచ్చింది.!

బోట్ లూనార్ ప్రో లైట్ ప్రత్యేకతలు

ఈ లూనార్ ప్రో లైట్ స్మార్ట్ వాచ్ 1.39 ఇంచ్ AMOLED డిస్ప్లేని కస్టమైజ్ చెయ్యగల ఫేస్ లతో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ హార్ట్-రేట్ సెన్సార్, బ్లడ్-ఆక్సిజన్ సెన్సార్ మరియు Built-in GPS లను కలిగి ఉంటుంది. ఇందులో 100+ స్పోర్ట్ మోడ్స్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ మరియు 577 mAh బ్యాటరీ ఉన్నాయి. IP68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :