boAt Chrome Horizon smartwatch with video watch faces launched
boAt Chrome Horizon స్మార్ట్ వాచ్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను రెగ్యులర్ స్మార్ట్ వాచ్ ల మాదిరిగా కాకుండా వీడియో వాచ్ ఫేసెస్ మరియు యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ ఫీచర్ తో బోట్ లాంచ్ చేసింది. బోట్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
బోట్ ఈ స్మార్ట్ వాచ్ ను రూ. 2,799 రూపాయల ధరతో మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ మరియు బోట్ అధికారిక సైట్ నుంచి లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ సిలికాన్, లెథర్ మరియు స్టీల్ స్ట్రాప్స్ లో లభిస్తుంది.
బోట్ క్రోమ్ హారిజన్ స్మార్ట్ వాచ్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ బోట్ స్మార్ట్ వాచ్ 1.51 ఇంచ్ ఇమ్మర్సివ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ బోట్ స్మార్ట్ వాచ్ స్క్రీన్ 2.5D కర్వ్ గ్లాస్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 466×466 రిజల్యూషన్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు వేక్ జెశ్చర్ కంట్రోల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఫంక్షనల్ క్రౌన్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను వారం మొత్తం బ్యాటరీ లైఫ్ అందించే బ్యాటరీ మరియు ASAP ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ వాచ్ IP68 రేటింగ్ తో డస్ట్, స్వెట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Amazon Summer Sale టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ రివీల్ చేసిన అమెజాన్.!
ఈ బోట్ స్మార్ట్ వాచ్ Crest App సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప హెల్త్ డిటైల్స్ అందిస్తుంది. ఈ వాచ్ ఆటో యాక్టివిటీ డిటెక్షన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్ డైలీ యాక్టివిటీ ట్రాకింగ్, స్మార్ట్ రిమైండర్స్, నోటిఫికేషన్, క్విక్ రిప్లై మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ వాచ్ 100 కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అదనంగా, ఈ బాట్ స్మార్ట్ వాచ్ వీడియో వాచ్ ఫేసెస్ మరియు యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.