Amazfit Bip 5: బిగ్ డిస్ప్లే మరియు పర్సనలైజ్డ్ ఫీచర్స్ తో లాంచ్.!

HIGHLIGHTS

అమేజ్ ఫిట్ కొత్త స్మార్ట్ వాచ్ Amazfit Bip 5 ను ఈరోజు లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ వాచ్ ను బిగ్ 1.9 ఇంచ్ బిగ్ డిస్ప్లే మరియు పర్సనలైజ్డ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ వాచ్ ను "Go Bigger, Go Smarter" క్యాప్షన్ తో లాంచ్ చేసింది

ఇండియన్ మార్కెట్ లో అమేజ్ ఫిట్ కొత్త స్మార్ట్ వాచ్ Amazfit Bip 5 ను ఈరోజు లాంచ్ చేసింది. అమేజ్ ఫిట్ ఈ స్మార్ట్ వాచ్ ను బిగ్ 1.9 ఇంచ్ బిగ్ డిస్ప్లే మరియు పర్సనలైజ్డ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. కంపెనీ ఈ స్మార్ట్ వాచ్ ను "Go Bigger, Go Smarter" క్యాప్షన్ తో  ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. అమేజ్ ఫిట్ ఈరోజే కొత్తగా లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Amazfit Bip 5: ఫీచర్స్

Amazfit Bip 5 స్మార్ట్ వాచ్ 1.91 ఇంచ్ HD color డిస్ప్లేని 2.5D tempered గ్లాస్ ప్రొటెక్షన్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ తో వస్తుంది కాబట్టి మంచి క్లారిటీ అందిస్తుంది మరియు టాంపర్డ్ గ్లాస్ తో మంచి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఈ అమేజ్ ఫిట్ బిప్ 5 స్మార్ట్ వాచ్ ను 70+ ఆకర్షణీయమైన ఫేస్ లు మరియు 13 ఎడిట్ చెయ్యగల ఫేస్ అప్షన్ లతో లాంచ్ చేసింది.

Bip 5 స్మార్ట్ వాచ్ Bluetooth కాలింగ్ సపోర్ట్ వస్తుంది మరియు ఇన్ బిల్ట్ మైక్రో ఫోన్ తో పాటు స్పీకర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ అమేజ్ ఫిట్ వాచ్ 30+ mini-games లకు సపోర్ట్  కూడా చేస్తుంది. 

ఈ బిప్ 5 స్మార్ట్ వాచ్ Zepp OS 2.0 పైన పని చేస్తుంది. ఇది స్లీప్ క్వాలిటీ మోనిటరింగ్, మెన్స్ట్రువల్ సైకిలింగ్ మోనిటర్ ట్రాకింగ్, PAI హెల్త్ అస్సెస్మెంట్ మరియు మరిన్ని హెల్త్ అలర్ట్స్ లను కలిగి వుంది ఈ స్మార్ట్ వాచ్. ఇది BioTracker PPG sensor ని Zepp OS 2.0 తో జతగా కలిగి వుంది కాబట్టి blood-oxygen శాచురేషన్, హార్ట్ రేట్ మరియు stress level monitoring ని చక్కగా నిర్వహించ గలదని కంపెనీ తెలిపింది. 

Amazfit Bip 5 price

ఇక ఈ Amazfit Bip 5 స్మార్ట్ వాచ్ ప్రైస్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ వాచ్ ను కంపెనీ రూ. 7,499 ధరతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ఆగష్టు 31 నుండి Amazon ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :