Xiaomi Smart TV: బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ టీవీ విడుదల చేసిన షియోమీ.!

Updated on 22-May-2024
HIGHLIGHTS

షియోమీ ఇప్పుడు మరోక బడ్జెట్ స్మార్ట్ టీవీ ని అందించింది

ఈ స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల చేసింది

Xiaomi Smart Tv A Series నుండి 32 ఇంచ్ 2024 Edition టీవీని కొత్తగా విడుదల చేసింది

Xiaomi Smart TV: ఇప్పటికే అనేక స్మార్ట్ టీవీ లను అందించిన షియోమీ ఇప్పుడు మరోక బడ్జెట్ స్మార్ట్ టీవీ ని కూడా అందించింది. Smart Tv A Series నుండి 32 ఇంచ్ 2024 Edition స్మార్ట్ టీవీని కొత్తగా విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ ప్రైస్ మరియు ఫీచర్స్ తో పాటుగా కంప్లీట్ స్పెక్స్ తెలుసుకోండి.

Xiaomi Smart TV: Price

షియోమీ ఈ కొత్త స్మార్ట్ టీవీ ని రూ. 13,499 రూపాయల ధరలో విడుదల చేసింది. ఈ టీవీ రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ టీవీని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI ఆప్షన్ తో కొనేవారికి ఫ్లాట్ రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ అందుతుంది. మే 28వ తేదీ నుంచి ఈ స్మార్ట్ టీవీ సేల్ మొదలువుతుంది.

Also Read: Realme GT 6T : భారీ ఫీచర్లతో సర్ప్రైజింగ్ ధరలో వచ్చింది.!

Xiaomi Smart TV: ఫీచర్లు

స్మార్ట్ టీవీ A సిరీస్ నుండి తీసుకు వచ్చిన ఈ 32 ఇంచ్ 2024 Edition స్మార్ట్ టీవీ ఆల్ రౌండ్ ఫీచర్స్ తో వచ్చింది. ఈ స్మార్ట్ టీవీని అంచులు లేని ప్రీమియం మెటల్ ఫ్రేమ్ డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ టీవీ Cortex A35 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 1GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది.

Xiaomi Smart TV

ఈ షియోమీ టీవీ 1366 X 768 రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు Vivid పిక్చర్ ఇంజన్ తో మంచి విజువల్స్ అందిస్తుందని షియోమీ తెలిపింది. ఈ టీవీ Dolby Audio మరియు DTS Virtual: X సౌండ్ సపోర్ట్ కలిగిన 20 స్పీకర్లతో వస్తుంది.

ఈ టీవి లో 2 HDMI, 2 USB, ఈథర్నెట్, 1AV మరియు 3.5mm జాక్ పోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ బ్లూటూత్ 5.0 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి వుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ లో ALLM (ఆటో లో లెటెన్సీ మోడ్) మరియు ARC తో (Dolby Atmos పాస్ త్రు) వంటి ఫీచర్లు ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :
Tags: tech news