Wobble launches 9 new budget smart tvs in indian market
Wobble ఈరోజు ఇండియన్ మార్కెట్లో 9 కొత్త బడ్జెట్ Smart Tv లను విడుదల చేసింది. వీటిలో మూడు QLED స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి. కొత్తగా వబల్ విడుదల చేసిన 9 స్మార్ట్ టీవీలలో 32 ఇంచ్ మొదలుకొని 65 ఇంచ్ వరకు టీవీలు అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీలను మెడ్ ఇన్ ఇండియా గా అందించినట్లు కూడా కంపెనీ తెలిపింది. ఈరోజు విడుదలైన వబల్ 9 స్మార్ట్ టీవీల ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
ఈ వబల్ స్మార్ట్ టీవీలను కంపెనీ యొక్క X Series మరియు K Series నుంచి అందించింది. ఈ 9 కొత్త స్మార్ట్ టీవీలు కూడా Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది.
ఈ సిరీస్ నుంచి మొత్తం 6 స్మార్ట్ టీవీలు కంపెనీ విడుదల చేసింది. ఈ 6 స్మార్ట్ టీవీల ధర ఇప్పుడు చూద్దాం.
32 ఇంచ్ HD స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 10,999
40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 14,499
43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 17,499
43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 20,499
55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 29,499
65 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 39,499
ఈ సిరీస్ నుంచి మూడు క్యూలెడ్ స్మార్ట్ టీవీలు అందించింది. ఈ స్మార్ట్ టీవీ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
43 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 23,999
50 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 30,499
55 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ ప్రైస్ : రూ. 34,999
ఈ అన్ని స్మార్ట్ టీవీలు కూడా పూర్తిగా ఒక సంవత్సరం వారంటీ కలిగి ఉంటాయి.
ఈ సిరీస్ నుంచి అందించిన మూడు క్యూలెడ్ స్మార్ట్ టీవీలు కూడా ఒకే రకమైన ఫీచర్స్ ను కలిగి ఉంటాయి. ఈ మూడు టీవీలు కలిగిన స్క్రీన్ సైజులో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ మూడు టీవీలు కూడా మంచి బ్రైట్నెస్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటాయి. ఈ టీవీలు Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందించే ఫీచర్ కలిగి ఉంటాయి. ఈ టీవీలు A55 + A75 డ్యూయల్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తాయి మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 16GB స్టోరేజ్ కలిగి ఉంటాయి.
సౌండ్ పరంగా ఈ టీవీలలో గొప్ప సెటప్ ఉంటుంది. ఇందులో డ్యూయల్ యాంప్లిఫైయర్ ఉంటుంది మరియు ఉఫర్ జతగా ట్వీటర్ సెటప్ తో ఉంటుంది. ఈ టీవీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో టోటల్ 80W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ టీవీలు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: BSNL Super Plan: వన్ రూపీ వన్ మంత్ ఆఫర్ రేపటితో క్లోజ్ అవుతుంది.!
ఈ సిరీస్ లో 43 ఇంచ్ 4K మరియు పెద్ద మోడల్స్‌లో AI ఔట్ పుట్ ఆగ్యుమెంటేషన్ ఫీచర్ అందించారు. ఇది ముఖ గుర్తింపు (Facial Detection), ఆబ్జెక్ట్ రికగ్నిషన్, సీన్ అనాలిసిస్ వంటి టెక్నాలజీలను ఉపయోగించి వీడియో నాణ్యతను ఆటోమేటిక్‌గా మెరుగుపరుస్తుంది. ఒక ఈ స్మార్ట్ టీవీలు కలిగిన ప్రొసెసర్ విషయానికి వస్తే, 32 ఇంచ్ మరియు 40 ఇంచ్ మోడల్స్‌లో A55 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 43 ఇంచ్ 4K మోడల్ మరియు అంతకన్నా పెద్ద మోడల్స్‌లో A55 + A72 డ్యూయల్-కోర్ ప్రాసెసర్ (ఇంటిగ్రేటెడ్ AI తో) అందించారు.
ఈ మొత్తం సిరీస్ టీవీలలో HDR10 సపోర్ట్ లభిస్తుంది. అయితే, 4K మోడల్స్‌లో మాత్రం Dolby Vision కూడా అందుబాటులో వుంది. ఈ ఫీచర్ తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరింత సినిమాటిక్ ఫీల్ ఇస్తాయి. ఆడియో పరంగా చూస్తే, 32 ఇంచ్, 40 ఇంచ్ మరియు 43 ఇంచ్ మోడల్స్ 30W సౌండ్ అవుట్ పుట్ కలిగి ఉంటాయి. అయితే, 55 ఇంచ్ మోడల్ కు 36W మరియు 65 ఇంచ్ టీవీలో 40W స్పీకర్ అవుట్ పుట్ ఉంటుంది. ఈ అన్ని టీవీలు కూడా బిల్ట్ ఇన్ Wi-Fi సో సహ మల్టీ కనెక్టివిటీ కలిగి ఉంటాయి.