అండర్ రూ. 25,000 ధరలో బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్స్ పై ఒక లుక్కేద్దామా.!

Updated on 21-Jul-2025
HIGHLIGHTS

అండర్ రూ. 25,000 ధరలో బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్స్

ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్స్ అందిస్తున్నాము

ఈరోజు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫ్లిప్ కార్ట్ నుంచి రెండు బేస్డ్ డీల్స్ లభిస్తున్నాయి

అండర్ రూ. 25,000 ధరలో బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్స్ కోసం చూస్తున్న వారి కోసం ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్స్ అందిస్తున్నాము. పెద్ద స్మార్ట్ టీవీ అందులోనూ క్యూలెడ్ స్క్రీన్ కలిగిన టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారు ఈరోజు లభిస్తున్న ఈ డీల్స్ పరిశీలించవచ్చు. 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో పెద్ద క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారిలో మీరు కూడా ఒకరైతే, ఈరోజు లభిస్తున్న ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి.

50 ఇంచ్ QLED Smart Tv : డీల్స్

ఈరోజు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫ్లిప్ కార్ట్ నుంచి రెండు బేస్డ్ డీల్స్ లభిస్తున్నాయి. ఇందులో ఒకటి KODAK 50 ఇంచ్ టీవీ అయితే, రెండవది Thomson 50 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఈ రెండు స్మార్ట్ టీవీ వివరాలు ఇప్పుడు చూద్దాం.

KODAK (50) QLED Smart Tv

50MT5011 మోడల్ నెంబర్ కలిగిన ఈ కోడాక్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 48% భారీ డిస్కౌంట్ తో రూ. 25,999 ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ ధరలో అందించే ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగిన 4K QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ హై బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ కలిగి మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు HMDI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Also Read : Online Gaming Ban: ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ కోసం కేంద్రం తో మహారాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు.!

Thomson (50) క్యూలెడ్ స్మార్ట్ టీవీ

ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కూడా ఈరోజు ఫిప్ కార్ట్ నుంచి చవక ధరలో లభిస్తుంది. ఈ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన 48% భారీ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ రూ. 25,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై కూడా HDFC కార్డ్ రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.

ఈ థాంసన్ టీవీ కూడా 50 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది మరియు ఇది 4K రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ కూడా HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB మరియు HDMI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :