సూపర్ డీల్: 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి ఈరోజు బెస్ట్ టీవీ డీల్ అందించింది

కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్

బిగ్ బచాత్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను ఆఫర్ చేస్తోంది

సూపర్ డీల్: 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

సూపర్ డీల్: ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి ఈరోజు అందుబాటులో ఉన్న గొప్ప స్మార్ట్ టీవీ డీల్ గురించి చూడనున్నాము. ఈ స్మార్ట్ టీవీ రీసెంట్ గా భారత మార్కెట్ లో విడుదలయ్యింది మరియు ఈరోజు చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఎంత చవక ధరకు ఈ టీవీ లభిస్తుందంటే, కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకునేంత చవక ధరకు లభిస్తుంది. మరి ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఆ టాప్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా 55 ఇంచ్ QLED Smart Tv డీల్?

Blaupunkt ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (55QD7020) పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 48% భారీ డిస్కౌంట్ తో రూ. 30,999 ఆఫర్ ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ టీవీ పై అందించిన భారీ బ్యాంక్ ఆఫర్ ద్వారా ఈ టీవీ ఇంత చవక ధరకు లభిస్తుంది.

అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,500 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని ఫ్లిప్ కార్ట్ అందించింది. HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డు తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 28,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో బిగ్ బ్రాండ్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీలు మాత్రమే లభిస్తాయి.

Also Read: ఈరోజు బెస్ట్ Dolby Atmos Soundbar డీల్ పై ఒక లుక్కేయండి.!

Blaupunkt (55) QLED Smart Tv: ఫీచర్స్

ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన QLED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ బడ్జెట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

Blaupunkt (55) QLED Smart Tv

ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ నాలుగు స్పీకర్లు కలిగి 60W హెవీ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ లో Dolby Digital Plus మరియు DTS సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఇక యూజర్ రేటింగ్ విషయానికి వస్తే, ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.5 రేటింగ్ అందుకుంది. అలాగే, పాజిటివ్ రివ్యూలు కూడా అందుకుంది.ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు కేవలం 28 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile