todays best budget 43 inch 4K Smart Tv deal on flipkart
ఈరోజు అతి చవక ధరలో లభిస్తున్న బెస్ట్ 43 ఇంచ్ 4K Smart Tv గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము. ఈ స్మార్ట్ టీవీ పై లభిస్తున్న అన్ని ఆఫర్స్ తో కేవలం రూ. 14,999 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. అండర్ రూ . 15,000 బడ్జెట్ సెగ్మెంట్ లో బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ కొనాలని చూసే వారు ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ పై ఒక లుక్కేయండి.
ఈ డీల్ మీకు ఫ్లిప్ కార్ట్ నుంచి మీకు అందుబాటులో ఉంది. ఈ డీల్ ఏమిటంటే, Kenstar గత్ సంవత్సరం చివరిలో అందించిన 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43UHDTDKEETB పై 63% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ టీవీ ఈరోజు కేవలం రూ. 16,499 రూపాయల డిస్కౌంట్ ధరకేసేల్ అవుతోంది. ఈ కెన్ స్టార్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై BOB CARD EMI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ ఆప్షన్ తో రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ టీవీపై అందించిన రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 14,999 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. అంటే, కేవలం 15 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది.
Also Read: Vivo V70 మరియు V70 Elite ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది.!
ఈ కెన్ స్టార్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 300 నిట్స్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ కెన్ స్టార్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది. ఈ టీవీ 1.5 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈ టీవిలో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఈ టీవీ టోటల్ 24W సౌండ్ అందిస్తుంది. అదనంగా, ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ కెన్ స్టార్ టీవీ Samsung Tizen OS పై నడుస్తుంది. ఈ టీవీ HDMI, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.