QD-Mini LED Smart Tv లాంచ్ చేస్తున్న TCL: ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Updated on 26-May-2025
HIGHLIGHTS

TCL ఇండియాలో Q6C సిరీస్ నుంచి మూడు కొత్త QD-Mini LED Smart Tv లను విడుదల చేస్తోంది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ కీలకమైన ఫీచర్స్ మరియు టీవీ డిజైన్ వివరాలతో టిసిఎల్ టీజింగ్ మొదలు పెట్టింది

ఈ అప్ కమింగ్ టిసిఎల్ స్మార్ట్ టీవీ లలో గొప్ప విజువల్స్ ఆశించవచ్చట

ప్రముఖ స్మార్ట్ టీవీ తయారీ కంపెనీ TCL ఇండియాలో Q6C సిరీస్ నుంచి మూడు కొత్త స్మార్ట్ టీవీ లను విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ కీలకమైన ఫీచర్స్ మరియు టీవీ డిజైన్ వివరాలతో టిసిఎల్ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ టిసిఎల్ స్మార్ట్ టీవీ లలో గొప్ప విజువల్స్ ని ఆశించవచ్చని టిసిఎల్ టీజర్ ద్వారా వెల్లడించింది.

TCL QD-Mini LED Smart Tv : లాంచ్

టిసిఎల్ Q6C సిరీస్ నుంచి మూడు మినీ LED టీవీలను లాంచ్ చేస్తోంది. ఇందులో 55 ఇంచ్, 65 ఇంచ్ మరియు 75 ఇంచ్ స్మార్ట్ టీవీలు ఉంటాయి. ఈ టీవీలను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది మరియు ఈ టీవీలను మే 30వ తేదీ ఇండియాలో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

TCL QD-Mini LED Smart Tv : ఫీచర్స్

టిసిఎల్ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ కీలకమైన ఫీచర్స్ ను అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి నుంచి అందించింది. ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తుంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కోసం అమెజాన్ ఈ టీవీ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ తో టీజింగ్ చేస్తోంది.

ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ టీవీ అల్ట్రా స్లిమ్ డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ వరల్డ్స్ టెక్నాలజీ తో QLED మరియు OLED బెనిఫిట్స్ మిళితం చేస్తుంది. ఇందులో అల్ట్రా పీక్ బ్రైట్నెస్, అల్ట్రా హై కాంట్రాస్ట్, అల్ట్రా హై కలర్ గాముట్ మరియు అల్ట్రా లాంగ్ లైఫ్ స్పాన్ అందిస్తుందని టిసిఎల్ తెలిపింది.

ఈ స్మార్ట్ టీవీ పవర్ ఫుల్ లైట్ ఎమిటింగ్ చిప్, మైక్రో లెన్స్ మరియు మైక్రో OD తో జతగా డైనమిక్ లైటనింగ్ బయోనిక్ అల్గోరిథం ట్రాన్సిట్ రెస్పాన్స్ అండ్ బైడైరెక్షన్లల్ 23 bit తో ఉంటుంది. అంటే, ఈ టీవీ అత్యంత ఖచ్చితమైన లైట్ కంట్రోల్ తో హేలో ఇష్యూలు తొలగిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, టీవీ లలో సాధారణ కనిపించే లైట్ రింగ్ లేదా అధిక వెలుగు ఇందులో కనిపించదు.

ఈ టీవీలో 420 జోన్స్ వరకు ఖచ్చితమైన డిమ్మింగ్ సిరీస్ ఉంటుంది. అంటే, లోతైన బ్లాక్ మరియు గరిష్ట బ్రైట్నెస్ లు ఇందులో చూడవచ్చు. ఈ ఫీచర్ కారణంగా టీవీ మరింత గొప్ప విజువల్ వండర్ గా మారుతుంది. ఈ టీవీ 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. అంటే, ఈ టిసిఎల్ స్మార్ట్ టీవీ మరింత స్మూత్ గా నడుస్తుంది.

Also Read: iQOO Neo 10: భారీ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయ్యింది.!

ఈ టీవీని మరింత గొప్పగా నడపగల AiPQ Pro ప్రోసెసర్ తో జాతే చేసింది. ఇది Ai కాంట్రాస్ట్, Ai కలర్, Ai క్లారిటీ మరియు Ai HDR వంటి మరిన్ని పని లను Ai తో నిర్వహిస్తుంది. ఈ టీవీ ఇమేజ్ ద్వారా ఈ టీవీ లో డ్యూయల్ ఉఫర్ ఉన్నట్లు చూడవచ్చు. ఈ టీవీ సౌండ్ ఫీచర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే, టీవీ మరిన్ని ఫీచర్లు కూడా త్వరలో అందించే అవకాశం ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :