Sony, LG and Samsung Smart Tv prices could slash on Amazon and Flipkart sale
Amazon మరియు Flipkart రెండు ప్లాట్ ఫామ్స్ పై పండుగ సీజన్ సేల్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనౌన్స్ చేయగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ రెండు సేల్స్ నుంచి Sony, LG మరియు Samsung Smart Tv ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
Sony, LG మరియు Samsung Smart Tv ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం భారత ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన టాక్స్ స్లాబ్ అని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న 28% GST టాక్స్ స్లాబ్ నుంచి టీవీ లను 18% టాక్స్ స్లాబ్ లోకి తీసుకు వచ్చింది. ఈ కొత్త టాక్స్ స్లాబ్ తో స్మార్ట్ టీవీల ధరలు భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
అన్ని బ్రాండ్ స్మార్ట్ టీవీల పై ఈ టాక్స్ వర్తిస్తుంది కదా మరి ఈ మూడు బ్రాండ్స్ పేర్లు మాత్రమే ఎందుకు నొక్కి చెబుతున్నారు అని మీరు అడగొచ్చు. ఇందుకు కూడా తగిన కారణం ఉంది. అదేమిటంటే, ఈ మూడు కూడా ప్రీమియం బ్రాండ్స్ మరియు ఈ స్మార్ట్ టీవీల ధరలు కూడా చాలా ప్రీమియం గా ఉంటాయి. ఒక సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటు దాదాపు 60 వేల రూపాయల వరకూ ఉంటుంది. ఇది పూర్తిగా 28% టాక్స్ తో కలుపుకొని ఉంటుంది. ఇప్పుడు తగ్గిన 10% టాక్స్ తో ఈ స్మార్ట్ టీవీ పై రూ. 6,000 రూపాయల వరకు టాక్స్ తగ్గింపు లభిస్తుంది. ఇదే విధంగా ఎల్ జి మరియు శామ్సంగ్ స్మార్ట్ టీవీల పై కూడా భారీగా తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వం కొత్తగా అందించిన GST 2.0 రీఫార్మ్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఆ రోజు నుంచి స్మార్ట్ టీవీల రేట్లతో భారీ తగ్గింపు కనిపించే అవకాశం ఉంటుంది.ఇదే రోజు నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ పండుగ సీజన్ సేల్ కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ సేల్స్ నుంచి స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా తక్కువ ధరలో లభించే అవకాశం ఉంటుంది.
అంతేకాదు, ఈ కొత్త టాక్స్ స్లాబ్ AC లకు కూడా వర్తిస్తుంది కాబట్టి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మరియు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఏసీ లు కూడా భారీ తగ్గింపు ధరలో లభించే అవకాశం ఉంటుంది. అంటే, ఈ దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా కొత్త టీవీ లేదా ఏసీ కొనాలని చూసే వారికి మంచి ఆఫర్లు లభించే అవకాశం ఉంటుంది.