రెడ్మి నుండి 70 అంగుళాల 4K టీవీ వచ్చేసింది.

Updated on 29-Aug-2019
HIGHLIGHTS

ఈ టీవీ Dolby Audio మరియు DTS HDతో సహా అనేక ఆడియో టెక్నాలజీ యొక్క సపోర్ట్‌తో వస్తుంది.

గత కొన్ని రోజులుగా కేవలం వార్తల్లో మాత్రమే నిలిచిన రెడ్మి టీవీని ఎట్టకేలకు ఈ రోజు లాంచ్ చేసి, చైనాలో జరిగిన కార్యక్రమంలో ఈ టీవీని లాంచ్ చేశారు. ఈ కొత్త స్మార్ట్ టీవీ కంపెనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ పోర్ట్‌ఫోలియోలో Mi టీవీ మోడళ్లలో చేరనుంది. ప్రస్తుతం ఈ రెడ్మి టీవీ యొక్క 70 అంగుళాల మోడల్ మాత్రమే ప్రవేశపెట్టబడింది మరియు దీనిని రెడ్‌మి టీవీ 70-ఇంచ్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త టీవీలో 4 K రిజల్యూషన్, HDR సపోర్ట్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ మరియు ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్ వంటివి ఉన్నాయి. ఇవే కాకుండా, ఈ రెడ్మి టీవీతో పాటు కంపెనీ రెడ్మి నోట్ 8, రెడ్మి నోట్ 8 ప్రో మరియు రెడ్మి బుక్ 14 ల్యాప్‌టాప్‌లను కూడా విడుదల చేసింది.

ఈ రెడ్మి టీవీ 70 4K , మినిమలిస్ట్ డిజైన్‌తో వస్తుంది. దీని వ్యూయింగ్ ఏరియా  55-అంగుళాల స్క్రీన్ కంటే 60% ఎక్కువ మరియు రెడ్మి టీవీ 70 ”అల్టిమేట్ ఇమ్మెర్సివ్ వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుందని" సంస్థ పేర్కొంది .

ఈ రెడ్మి టీవీ 70-అంగుళాలు చైనాలో సెప్టెంబర్ 10 న అమ్మకానికి వస్తుంది, అయితే, ఆగస్టు 29 నుండి టీవీ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుందని షావోమి తెలిపింది. దీని ధర CNY 3,799 (సుమారు రూ .38,000). కానీ, ఈ ప్రొడక్స్ట్ యొక్క భారతీయ ధర లేదా లభ్యత ఇంకా తెలియలేదు.

ఈ రెడ్మి టీవీలో 70 అంగుళాల 4K  స్క్రీన్ ఉంది, ఇది హెచ్‌డిఆర్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టీవీ ,సంస్థ యొక్క ప్యాచ్‌వాల్ ప్లాట్‌ఫామ్‌లో పనిచేస్తుంది. ఈ టీవీలో క్వాడ్-కోర్ 64-బిట్ Amlogic SoC, 2GB RAM మరియు 16GB స్టోరేజి ఉన్నాయి. ఇది కాకుండా, టీవీ Dolby Audio మరియు DTS HDతో సహా అనేక ఆడియో టెక్నాలజీ యొక్క సపోర్ట్‌తో వస్తుంది.

కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 4.2, రెండు USB  పోర్ట్‌లు, మూడు HDMI పోర్ట్‌లు, AV ఇన్‌పుట్ మొదలైనవి అందించబడ్డాయి, అదనంగా, కంపెనీ ఈ రెడ్మి టివి తో బ్లూటూత్-పవర్డ్ వాయిస్ రిమోట్‌ను కూడా అందిస్తోంది.   

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :