భారీ లాంచ్ అఫర్ తో 50 ఇంచ్ 4K HDR స్మార్ట్ టీవీ విడుదల చేసిన వన్ ప్లస్

భారీ లాంచ్ అఫర్ తో 50 ఇంచ్ 4K HDR స్మార్ట్ టీవీ విడుదల చేసిన వన్ ప్లస్
HIGHLIGHTS

వన్ ప్లస్ భారీ లాంచ్ అఫర్ తో 50 ఇంచ్ 4K HDR స్మార్ట్ టీవీని విడుదల చేసింది

ఈ 4K స్మార్ట్ టీవీ HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో వస్తుంది

వన్ ప్లస్ ఈ టీవీ పైన 3,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది

వన్ ప్లస్ భారీ లాంచ్ అఫర్ తో 50 ఇంచ్ 4K HDR స్మార్ట్ టీవీని విడుదల చేసింది.  అదే, Oneplus 50 Y1S Pro స్మార్ట్ టీవీ మరియు ఇది 4K UHD స్మార్ట్ టీవీ. ఈ 4K స్మార్ట్ టీవీ HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన వన్ ప్లస్ భారీ లాంచ్ అఫర్ ను కూడా జతగా ప్రకటించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని Axis Bank క్రెడిట్/ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 3,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. ఈ కొత్త స్మార్ట్ టీవీ ధర, ఆఫర్లు మరియు స్పెక్స్ తో పాటుగా పూర్తి వివరాల పై ఓకే లుక్ వేయండి.

Oneplus 50 Y1S Pro: ధర మరియు ఆఫర్లు

Oneplus 50 Y1S Pro 4K UHD స్మార్ట్ టీవీని రూ.32,999 ధరతో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ టీవీ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీని Axis Bank క్రెడిట్/ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 3,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ మొదటి సేల్ జూలై 7వ తేదీ 12 గంటలకి మొదలవుతుంది. అమెజాన్ తో పాటుగా OnePlus.in మరియు అన్ని ప్రధాన ఆఫ్ లైన్ స్టోర్ లలో కూడా లభిస్తుంది.

Oneplus Y1S Pro: ఫీచర్లు

ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ 50 Y1S Pro ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ 50 ఇంచ్ సైజులో 4K (3840×2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ Gamma ఇంజిన్ తో HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్ ను కలిగివుంది. 50 TV Y1S Pro స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో 24W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది.

ఇక ఈ స్మార్ట్ టీవీల ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఫీచర్ల గురించి చూస్తే, ఈ వన్ ప్లస్ 4K స్మార్ట్ టీవీ Android 10 OS తో పనిచేస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI eArc)  మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi, బ్లూటూత్ 5.0 మరియు వన్ ప్లస్ కనెక్ట్ 2.0 తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo