kodak launches four new QLED Smart Tvs from Kodak Matrix series
Kodak Matrix Series నుంచి రోజు నాలుగు కొత్త QLED Smart Tv లు విడుదల చేసింది. ఇందులో 43 ఇంచ్ మొదలు కొని 65 ఇంచ్ వరకు నాలుగు టీవీలు అందించింది. ఈ నాలుగు కొత్త స్మార్ట్ టీవీలను కూడా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త GST 2.0 Reform టాక్స్ స్లాబ్ తో అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీలు బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యాయి. కొడాక్ కొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
కొడాక్ ఈ సిరీస్ నుంచి అందించి నాలుగు టీవీల ప్రైస్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఈ కొత్త స్మార్ట్ టీవీలు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చాయి. ఈ స్మార్ట్ టీవీల పై అమెజాన్ GIF Sale మరియు ఫ్లిప్ కార్ట్ BBD Sale బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ వర్తిస్తాయి.
Also Read: Digital Ration Card: క్యూఆర్ కోడ్ తో రేషన్ అందించే కొత్త కార్డు కోసం ప్రభుత్వం కసరత్తు.!
ఈ నాలుగు కొత్త స్మార్ట్ టీవీలు కూడా 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటాయి. ఈ నాలుగు క్యూలెడ్ స్మార్ట్ టీవీలు కూడా HDR 10 సపోర్ట్, AI స్మూత్ మోషన్ మరియు 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటాయి. ఈ టీవీలు AiPQ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తాయి మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి.
ఈ టీవీలు Dolby Atmos, Dolby Digital మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటాయి. వీటిలో 43 ఇంచ్ మరియు 50 ఇంచ్ రెండు స్మార్ట్ టీవీలు రెండు స్పీకర్లు కలిగి 50W సౌండ్ అవుట్ పుట్ తో వస్తాయి. అయితే, 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ రెండు స్మార్ట్ టీవీలు కూడా 4 స్పీకర్లు కలిగి 60W సౌండ్ అందిస్తాయి. ఈ టీవీలు HDMI eArc, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, AV ఇన్, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది.