Jio – Netflix Plans: నెట్ ఫ్లిక్స్ మరియు అన్లిమిటెడ్ 5జి డేటా అందించే జియో బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

జియో అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ యూజర్స్ కి అందుబాటులో ఉన్నాయి

నెట్ ఫ్లిక్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ మరియు అన్లిమిటెడ్ 5జి డేటా అందించే జియో బెస్ట్ ప్లాన్స్

ఈ జియో బెస్ట్ ప్లాన్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి

Jio – Netflix Plans: ఎంటర్టైన్మెంట్ సౌలభ్యం తో జియో అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ యూజర్స్ కి అందుబాటులో ఉన్నాయి. అందులోనూ నెట్ ఫ్లిక్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ మరియు అన్లిమిటెడ్ 5జి డేటా అందించే జియో బెస్ట్ ప్లాన్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కేటగిరిలో రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లను రిలయన్స్ జియో తన యూజర్లకు ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్స్ మరియు అవి అందించే ప్రయోజనాలు ఏమిటో ఈరోజు చూద్దాం.

Jio – Netflix Plans

నెట్ ఫ్లిక్స్ మరియు అన్లిమిటెడ్ 5జి డేటా ఆఫర్ చేసే రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లను రిలయన్స్ జియో అందించింది. ఇందులో, రూ. 1,299 మరియు రూ. 1,799 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జియో రూ. 1,299 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 1,299 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 4జి నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా తో పాటు జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 100SMS సౌలభ్యం, జియో సినిమా జియో టీవీ, జియో క్లౌడ్ లకు యాక్సెస్ కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా ఆఫర్ చేస్తుంది.

Jio Netflix Plans

Also Read: CERT-in Alert: మీడియాటెక్ మరియు క్వాల్కమ్ చిప్ సెట్ లతో పనిచేసే ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు అలర్ట్.!

జియో రూ. 1,799 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 1,799 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ కూడా
వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ 4జి నెట్ వర్క్ పై డైలీ 3GB డేటా తో టోటల్ 252 GB ల డేటా మరియు జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా డైలీ 100SMS సౌలభ్యం అందుతుంది. జియో సినిమా జియో టీవీ, జియో క్లౌడ్ లకు యాక్సెస్ కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. అదనంగా, ఈ ప్లాన్ తో వ్యాలిడిటీ కాలానికి గాను నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందుకోవచ్చు.

మొబైల్ నెంబర్ రీఛార్జ్ లేదా ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :