Jio: ఈ జియో బడ్జెట్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 90 రోజులు నిశ్చింతగా ఉండొచ్చు.!

Updated on 06-Feb-2026
HIGHLIGHTS

బడ్జెట్ ధరలో వచ్చే ప్లాన్ అంటే అందరికీ ఎక్కువ మక్కువగా ఉంటుంది

అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో లభిస్తే ఆ మజానే వేరబ్బా

Jio రెండు బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ లను తన యూజర్లకు అందించింది

Jio: బడ్జెట్ ధరలో వచ్చే ప్లాన్ అంటే అందరికీ ఎక్కువ మక్కువగా ఉంటుంది. అందులోనూ అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో లభిస్తే ఆ మజానే వేరబ్బా అంటారు. ఇదే ఆలోచనతో టారిఫ్ రేట్లు పెరిగిన తర్వాత కూడా జియో రెండు బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ లను తన యూజర్లకు అందించింది. ఈ జియో బడ్జెట్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 90 రోజులు నిశ్చింతగా ఉండొచ్చు. ఈరోజు జియో అందించిన ఆ బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందామా.

Jio: జియో బడ్జెట్ ప్లాన్

గతంలో టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత జియో ప్లాన్స్ పై పెరిగిన దారము దృష్టిలో ఉంచుకొని కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటిలో రూ. 859 మరియు రూ. 899 ప్లాన్ బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.

జియో రూ. 859 ప్రీపెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 859 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు 100 SMS వంటి బెనిఫిట్స్ తీసుకొస్తుంది. అలాగే, 4జి నెట్ వర్క్ పై డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు అయి డేటా ముగిసిన తర్వాత 64Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది.

జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్

ఇక ఈ జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, 4G నెట్ వర్క్ పై డైలీ 2GB హై స్పీడ్ డేటా, 20 జీబీ అదనపు డేటా, 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ డేట్ మరియు డైలీ 100 SMS వంటి బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుంది.

ఈ రెండు ప్లాన్స్ అందించే కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్ తో రూ. 35,100 విలువైన 18 నెలల Google Gemini Pro యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. ఇదే కాదు రూ. 149 రూపాయల విలువైన జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, జియో టీవీ మరియు జియో Ai క్లౌడ్ యాక్సెస్ కూడా ఉచితంగా లభిస్తుంది.

Also Read: LG Dolby Atmos సూపర్ సౌండ్ బార్ ఈరోజు ఆల్ టైమ్ తక్కువ ధరలో లభిస్తోంది.!

ఈ రెండు ప్లాన్స్ కూడా నెలకు కేవలం రూ. 300 కంటే తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ బెనిఫిట్స్ మరియు మరిన్ని లాభాలు అందించే ఉచిత బెనిఫిట్స్ కూడా అందిస్తాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :