Smart Tv Buying Guide
జబర్దస్త్ ఆఫర్: ఫ్లిప్ కార్ట్ ప్రతి నెలా అందించే బిగ్ బాచాత్ డే సేల్ నుంచి ఈరోజు గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ లేటెస్ట్ సేల్ నుంచి గొప్ప Smart Tv ఆఫర్ ని కూడా అందించింది. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన TCL స్మార్ట్ టీవీని ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాను.
TCL సబ్ బ్రాండ్ ఐఫాల్కన్ గత సంవత్సరం ఇండియాలో విడుదల చేసిన U64 సీరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (iFF55U64) పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 63% జబర్దస్త్ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ ఐఫాల్కన్ బిగ్ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం రూ. 26,999 ధరకు లిస్ట్ అయ్యింది.
ఈ స్మార్ట్ టీవీ ని మరింత చవక ధరకు అందుకునేలా అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని BOBCARD మరియు SBI క్రెడిట్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ ని కేవలం రూ. 25,499 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10, డైనమిక్ కలర్ ఎన్‌హెన్స్‌మెంట్ మరియు AI క్లారిటీ ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ A55 క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ మరియు 24W సౌండ్ అవుట్ పుట్ తో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ HDMI (eArc), USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: Google Play Store నుంచి 23 లక్షలకు పైగా ప్రమాదకరమైన యాప్స్ బ్యాన్.!
ఈ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఈరోజు ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో 25 వేల రూపాయల బడ్జెట్ లో అందుకోవచ్చు.