అందుబాటు ధరలో Haier H5E Series నుండి కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది.!

Updated on 15-Jan-2026
HIGHLIGHTS

భారత మార్కెట్లో హైయర్ కొత్త స్మార్ట్ టీవీలు చేసింది

H5E Series నుంచి ఈ కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది

ఈ టీవీలు సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టాయి

భారత మార్కెట్లో హైయర్ కొత్త స్మార్ట్ టీవీలు చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్ లో కొనసాగుతున్న టీవీలకు పోటీ ధరతో అందించింది. H5E Series నుంచి ఈ కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది మరియు ఈ టీవీలు సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టాయి. ఈ హైయర్ కొత్త స్మార్ట్ టీవీలు బెజెల్ లెస్ డిజైన్, 4K HDR10 సపోర్ట్ మరియు డాల్బీ ఆడియో సపోర్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లతో లాంచ్ అయ్యాయి.

Haier H5E Series : స్మార్ట్ టీవీ ప్రైస్

హైయర్ ఈ కొత్త సిరీస్ నుంచి మొత్తం నాలుగు టీవీలు విడుదల చేసింది. ఇందులో 43 ఇంచ్ నుంచి మొదలుకొని 65 ఇచ్ వరకు స్క్రీన్ సైజులు ఉన్నాయి. ఈ నాలుగు టీవీ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

  • హైయర్ H5E (43-inch) ప్రైస్ : రూ. 25,990
  • హైయర్ H5E (50-inch) ప్రైస్ : రూ. 32,990
  • హైయర్ H5E (55-inch) ప్రైస్ :: రూ. 38,990
  • హైయర్ H5E (65-inch) ప్రైస్ :: రూ. 57,990

ఈ క్రొత్త స్మార్ట్ టీవీలు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ నుంచి సేల్ కి అందుబాటులో వస్తాయి. వాస్తవానికి, ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి సేల్ కి వస్తుందని తెలిపారు. అయితే, ఈ టీవీ అమెజాన్ నుంచి కూడా లిస్ట్ అవ్వడం మేము గమనించాము.

Also Read: Google Veo 3.1: ఇమేజ్ తో Vertical AI వీడియో క్రియేట్ చేసే కొత్త ఫీచర్ అందించిన గూగుల్!

Haier H5E Series : ఫీచర్స్

ఈ హైయర్ కొత్త సిరీస్ స్మార్ట్ టీవీలు 4K UHD (3840 × 2160) రిజల్యూషన్ మరియు 6Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటాయి. ఈ లేటెస్ట్ హైయర్ టీవీలు HDR10 సపోర్ట్ మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తాయని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ టీవీ అడ్వాన్స్‌డ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ మరియు MEMC సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ వేగంగా పని చేయడానికి వీలుగా 2 జీబీ ర్యామ్ మరియు ఎక్కువ యాప్స్ డౌన్‌లోడ్ చేయడానికి వీలుగా 32 జీబీ బిగ్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ టీవిలలో అందించిన ఆడియో సెటప్ విషయానికి వస్తే, ఈ టీవీలు డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటాయి మరియు టోటల్ 20W సౌండ్ అందిస్తాయి. ఈ టీవీలు Dolby Audio మరియు సరౌండ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ టీవీలలో మొత్తం 7 సౌండ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. యూజర్ ఇష్టాన్ని లేక కంటెంట్ డిమాండ్ ను బట్టి ఈ మోడ్స్ ను సెట్ చేసుకోవచ్చు.

ఈ కొత్త స్మార్ట్ టీవీలు లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్లతో రన్ అవుతాయి. అంటే, ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, HDMI, బ్లూటూత్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :