GST 2.0 Effect: భారీగా తగ్గనున్న Smart Tv ధరలు.. కొత్త టీవీ కొనే వారికి పండగే.!

Updated on 08-Sep-2025
HIGHLIGHTS

దేశ ప్రజలకు ప్రభుత్వం GST 2.0 Reform కొత్త టాక్స్ స్లాబ్ అందించింది

ఈ కొత్త ట్యాక్స్ స్లాబ్స్ లో బీద మరియు మధ్య తరగతి ప్రజలకు మంచి ప్రయోజనం చేకూర్చింది

Smart Tv మరియు ఏసీల ధరలు భారీగా తగ్గిపోయే అవకాశం వుంది

దేశ ప్రజలకు ప్రభుత్వం GST 2.0 Reform కొత్త టాక్స్ స్లాబ్ అందించింది. ఈ కొత్త ట్యాక్స్ స్లాబ్స్ లో బీద మరియు మధ్య తరగతి ప్రజలకు మంచి ప్రయోజనం చేకూర్చింది. కొత్త టాక్స్ స్లాబ్స్ తో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అంతేకాదు, సెప్టెంబర్ 22 రాగానే కొత్త వస్తువులు కొనాలని కూడా ఎదురుచూసే వారున్నారు. ఇందులో ముఖ్యంగా Smart Tv మరియు AC కొనాలని చూసే వారు ముందు వరుసలో ఉన్నారు. ఎందుకంటే, స్మార్ట్ టీవీ మరియు ఏసీల ధరలు భారీగా తగ్గిపోయే అవకాశం వుంది.

GST 2.0 Effect: Smart Tv ప్రైస్

కొత్త జీఎస్టీ తో స్మార్ట్ టీవీ ధరలో భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు టీవీలు 28% టాక్స్ స్లాబ్ లో ఉండగా, సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త టాక్స్ స్లాబ్ తో కేవలం 18% మాత్రమే టీవీలు మరియు ఏసీ లకు ట్యాక్స్ వర్తిస్తుంది. అంటే, నేరుగా 10% ట్యాక్స్ తగ్గిపోతుంది. అంటే, స్మార్ట్ టీవీల ధరలు 10% శాతం వరకు తగ్గాలి. ప్రస్తుత టాక్స్ స్లాబ్ తో కొనసాగుతున్న స్మార్ట్ టీవీల రేట్లతో పోలిస్తే కనుక సెప్టెంబర్ 22వ తేదీ నుంచి స్మార్ట్ టీవీ రేట్లు భారీగా పడిపోయే అవకాశం ఉంటుంది.

ఇది క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పడానికి ఉదాహరణ తీసుకుంటే, ప్రస్తుతం 40 వేల రూపాయల ధరలో అమ్ముడవుతున్న ఒక స్మార్ట్ టీవీ సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత 36 వేల రూపాయల ధరలో లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ప్రస్తుతం 40,000 రూపాయల స్మార్ట్ టీవీ ప్రైస్ లో రూ. 11,200 రూపాయల GST కట్టాల్సి వస్తుంది. అయితే, సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత ఇదే స్మార్ట్ టీవీకి జీఎస్టీ కేవలం 18% మాత్రమే అవుతుంది. అంటే, రూ. 7,200 రూపాయలు మాత్రమే టాక్స్ వర్తిస్తుంది. ఈ మిగిలిన రూ. 4,000 రూపాయలు అమౌంట్ స్మార్ట్ టీవీ ప్రైస్ నుంచి తగ్గిస్తే ఇదే టీవీ రూ. 36,000 రూపాయలకే లభించే అవకాశం ఉంటుంది. ఇదే టాక్స్ ఏసీ లకు కూడా వర్తిస్తుంది. కాబట్టి, ఏసీల ధరలు కూడా బాగా త్తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

Also Read: Cyber Scams నుంచి మీ వ్యక్తిగత డేటా రక్షించుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోండి.!

అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ కూడా వారి దసరా మరియు దీపావళి బిగ్ సేల్స్ ను సెప్టెంబర్ 23 నుంచి మొదలు పెడుతున్నాయి కాబట్టి ఈసారి సేల్స్ నుంచి స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ ధరలో లభించే అవకాశం ఉండవచ్చు. మీరు పండుగ సీజన్ నుండి కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే 2025 పండుగ సీజన్ మీకోసం లాభదాయకమైన పండుగ సేల్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :