get QLED Smart Tv at rs 8999 from flipkart
బడ్జెట్ ధరలో QLED Smart Tv కోసం సెర్చ్ చేసే వారికి గుడ్ న్యూస్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ద్వారా మీ కల నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్రాండెడ్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ బ్రాండెడ్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం 8 వేల రూపాయల అఫర్ ధరకే లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ పై ఒక లుక్కేద్దామా.
ప్రముఖ టీవీ బ్రాండ్ Dyanora లేటెస్ట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (DY-LD32H3S) పై ఈరోజు ఈ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ ని 57% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.
ఈ టీవీని మరింత చవక ధరకు అందుకోవడానికి వీలుగా 10% బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి Federal మరియు BOBCARD EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీ రూ. 8,100 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
డయనోరా యొక్క యొక్క ఈ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ 1336 x 768 రిజల్యూషన్ కలిగిన HD Ready క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ కలిగి గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 512MB ర్యామ్ మరియు 4 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi తో వస్తుంది.
ఈ డయనోరా స్మార్ట్ టీవీ 30W హై ఫెడిలిటీ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ వర్చువల్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఇదే సంవత్సరంలో విడుదల చేయబడింది మరియు మంచి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
Also Read: OPPO Enco X3i: మార్కెట్ లో కొత్త బడ్స్ లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
గమనిక: ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్ ఆధారంగా వివరాలు అందించాము. ఈ టీవీ ని మేము రివ్యూ చేయలేదు.