Flipkart Year End Sale best 4K QLED Smart Tv around 15k today
Flipkart Year End Sale: ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ నుంచి ఈరోజు గొప్ప డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో చాలా ప్రోడక్ట్స్ మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. అందులో, స్మార్ట్ టీవీ డీల్స్ మరింత ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి టీవీలు ఎంత చవక ధరకు లభిస్తున్నాయంటే, కేవలం 15 వేల ధరకే బ్రాండెడ్ 4K QLED Smart Tv కూడా లభిస్తుంది. అందుకే, ఈరోజు ఈ బడ్జెట్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను ప్రత్యేకంగా అందిస్తున్నాము.
ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ డీల్ మీకు అందుబాటులో ఉంది. అదేమిటంటే, Infinix యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (43GU3Q) డీల్. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 16,999 ధరతో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై అందించిన అదనపు 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 15,499 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. ఈ టీవీని BOB CARD మరియు HDFC కు క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: BSNL యూజర్లకు క్రిస్మస్ పండుగ కానుక ప్రకటించింది.. ఛాన్స్ ఒక్క వారం మాత్రమే.!
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, HDR 10 మరియు హై డైనమిక్ రేంజ్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో ఉంటుంది. ఈ టీవీని స్మూత్ గా నడపడానికి 2 జీబీ ర్యామ్ మరియు ఎక్కువ యాప్స్ స్టోర్ చేయడానికి 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఈ టీవీ అంచులు కనిపించని బెజెల్ లెస్ డిజైన్ తో ఉంటుంది.
ఈ టీవీ సౌండ్ పరంగా చూస్తే, ఇది రెండు స్పీకర్లు కలిగి టోటల్ 40W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ టీవీలో మంచి కంటెంట్ కి తగిన గొప్ప సౌండ్ అందిస్తుంది. HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్, ఈథర్నెట్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ టీవీ బడ్జెట్ ధరలో బెస్ట్ డీల్ అవుతుంది.