flipkart sale offers big discount on 50 inch Dolby Atmos QLED smart tv
ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ మీకోసం అందుబాటులో ఉంది. దివాళి ఆఫర్స్ నుంచి మంచి స్మార్ట్ టీవీ కొనడానికి చేసే వారిలో మీరు కూడా ఉంటే, ఈ డీల్ మీకోసమే అనుకోండి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన GST 2.0 రేట్లు మరియు ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన భారీ డిస్కౌంట్ తో 22 వేలకే 50 ఇంచ్ Dolby Atmos QLED స్మార్ట్ టీవీ లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ మరియు మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ని ప్రత్యేకంగా అందిస్తున్నాము.
2025 మధ్యలో Thomson Phoenix సిరీస్ నుంచి లాంచ్ చేసిన 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 50QAI1015 మోడల్ నెంబర్ తో ఉంటుంది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 41% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ టీవీని SBI క్రెడిట్ కార్డు తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 22,499 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.
Also Read: iQOO 15 ఇండియా లాంచ్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన ఐకూ.!
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ ని 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ AI మోషన్ స్మూత్ రేట్ మరియు HDR 10 సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ AiPQ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ థాంసన్ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ మరియు డీటీఎస్ ట్రూ సరౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు బాక్స్ స్పీకర్లు కలిగి వ్ఞతుంది మరియు టోటల్ 48W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, ఆప్టికల్, Av in, బ్లూటూత్, HDMI మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి గొప్ప ఆఫర్ ధరలో లభిస్తుంది.