flipkart offers big deals Thomson on latest 55 inch QLED Smart Tv
రేపటితో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ బై బై 2025 సేల్ నుంచి ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్ చేసింది. ఇందులో లేటెస్ట్ విడుదలైన థామ్సన్ స్మార్ట్ టీవీ డీల్ అమితంగా ఆకట్టుకుంటుంది. థామ్సన్ NeoX సిరీస్ నుంచి ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ QLED Smart Tv పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ డీల్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బిగ్ సౌండ్ మరియు గొప్ప విజువల్స్ అందించే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
థామ్సన్ నియో ఎక్స్ నుంచి రీసెంట్ గా ఈ స్మార్ట్ టీవీ విడుదల చేసింది. ఈరోజు ఈ టీవీ 36% డిస్కౌంట్ తో కేవలం రూ. 31,999 రూపాయల ధరలో లభిస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని Flipkart SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్, SBI అండ్ ICICI క్రెడిట్ కార్డు పై రూ . 1,000 డిస్కౌంట్ మరియు HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయలు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని రూ. 30,499 రూపాయల డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు. ఈ టీవీ ఈ ప్రైస్ లో గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Motorola Edge 70: ప్రపంచపు అతి సన్నని ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది.!
ఈ థామ్సన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, డాల్బీ విజన్, HDR 10+ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ALLM, VRR మరియు ఐ కేర్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, AI Neuro Drive, 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది మరియు గూగుల్ టీవీ 5.0 OS పై నడుస్తుంది.
సౌండ్ పరంగా, ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగి టోటల్ 70W హెవీ సౌండ్ అందిస్తుంది. ఇందులో అందించిన డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ మరియు AI క్లియర్ వాయిస్ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ వాయిస్ సపోర్ట్ కలిగిన వాయిస్ రిమోట్ తో వస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.