Flipkart offers big deal on xiaomi big smart tv before the big billion days sale
Flipkart The Big Billion Days Sale ప్రారంభం కావడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే ఫ్లిప్ కార్ట్ సూపర్ డీల్ అందించింది. షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మీ ఇండియాలో లేటెస్ట్ గా అందించిన 43 ఇంచ్ 4K Smart Tv పై ఈ ఆఫర్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లతో కలిపి కేవలం రూ. 18,490 ధరకే అందుకునే ఫ్లిప్ కార్ట్ ఈరోజు అవకాశం అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ మరియు ఈ స్మార్ట్ టీవీ వివరాలు ఏమిటో చూసేద్దాం పదండి.
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ డీల్ విషయానికి వస్తే, షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మీ ఇటీవల ఇండియాలో విడుదల చేసిన 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L43R8-FVIN పై ఈరోజు 53% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ దెబ్బకు ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు కేవలం రూ. 19,990 రూపాయల ఆఫర్ ధరకు ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది.
ఈ స్మార్ట్ టీవీని మరింత చవక ధరకు అందుకునేలా మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అదేమిటంటే, ఈ రెడ్ మీ 43 ఇంచ్ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీ ని ఈ ఆఫర్ తో కేవలం రూ. 18,490 రూపాయల అతి చవక ధరలో అందుకోవచ్చు.
Also Read: Jio New Plan: అన్లిమిటెడ్ డేటా మరియు కాలింగ్ 98 రోజులకు అందించే కొత్త ప్లాన్ తెచ్చిన జియో.!
రెడ్ మీ యొక్క ఈ స్మార్ట్ టీవీ ఈ ఆఫర్ ధరలో నిజంగా గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ మెటల్ ఫ్రేమ్ మరియు బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. ఈ టీవీ లో 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 3840 x 2160 రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. ఈ రెడ్ మీ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు ఇన్ బిల్ట్ Fire Tv తో చాలా వేగంగా ఉంటుంది. ఈ టీవీ Dolby Audio, DTS Virtual:X మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు 24W సౌండ్ అవుట్ పుట్ తో మంచి సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ టీవీలో HDMI, USB, ఈథర్నెట్, AV పోర్ట్, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
ఇటీవలే ఇండియాలో విడుదలైన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి గొప్ప డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ధరలో ఈ స్మార్ట్ టీవీ డీల్ బెస్ట్ డీల్ అయ్యే అవకాశం వుంది .