flipkart offers big deal on thomson 50 inch QLED Smart Tv from valentine's sale
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకు వచ్చిన వాలెంటైన్స్ సేల్ నుంచి గొప్ప డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ తో 43 ఇంచ్ టీవీ రేటుకే 50 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం లభిస్తుంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ భారీ డీల్ ను ఈరోజు అందిస్తున్నాను.
ఫ్లిప్ కార్ట్ వాలెంటైన్స్ సేల్ నుంచి ఈరోజు థాంసన్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (Q50H1000) ఈ ఆఫర్ అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ 48% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 25,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.
ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
Also Read: Samsung Galaxy F06 5G: 10 వేల కంటే తక్కువ ధరలో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న శామ్సంగ్.!
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ ను 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది మరియు మరిన్ని యాప్స్ స్టోర్ కి సహకరిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Netflix, Prime Video, Disney+Hotstar యాప్స్ తో పాటు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ 40 W సౌండ్ అందించే రెండు బాక్స్ స్పీకర్లు కలిగి ఉంటుంది. అలాగే, ఈ టీవీలో అందించిన Dolby Digital plus సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDMI, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.