flipkart offer huge discount on latest big 4k smart tv
ధమాకా ఆఫర్: 18 వేలకే బ్రాండెడ్ బిగ్ 4K Smart Tv అందుకోండి, అంటోంది ఫ్లిప్ కార్ట్. ఎందుకంటే, ఈరోజు పెద్ద 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ని భారీ డిస్కౌంట్ తో 18 వేల రూపాయల బడ్జెట్ లోనే సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ మంచి విజువల్ తో పాటుగా సౌండ్ సపోర్ట్ కూడా వస్తుంది. 20 వేల బడ్జెట్ లో కొత్త 4కె స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీ ని తక్కువ బడ్జెట్ లో కొనాలని చూస్తున్నట్లయితే, ఈ ఫ్లిప్ కార్ డీల్ పైన ఒక లుక్కేయండి.
ప్రముఖ బ్రాండ్ TCL యొక్క iFFALCON తీసుకు వచ్చిన 43 ఇంచ్ 4కె UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (iFF43U62) పైన ఈ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ పైన ఈరోజు 61% భారీ తగ్గింపును అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం రూ. 18,999 ధరకే లభిస్తోంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీని HDFC Bank Credit Card EMI ఆఫర్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే, ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ ని 18 వేల రూపాయల కంటే తక్కువ ధరకే అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లు క్రింద చూడవచ్చు.
Also Read : విడుదలకు ముందే లీకైన Redmi Note 13 Pro ఇండియా వేరియంట్ ధర.!
ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ 4కె అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లో Dolby Audio సపోర్ట్ కూడా వుంది. అయితే, ప్రసుతం లేటెస్ట్ స్మార్ట్ టీవీ లలో లభిస్తున్న Dolby Vision లేదా Dolby Atmos సపోర్ట్ మాత్రం ఉండదు. అయితే, ఈ టీవీ FHD స్మార్ట్ టీవీ కంటే ఉన్నతమైన పిక్చర్ క్వాలిటీని FHD టీవీ ధరలోనే అందిస్తుందని మాత్రం చెప్పవచ్చు.
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 GB మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ లో 3 HDMI, 2USB మరియు Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈటీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుండి 4.2 రేటింగ్ ను మరియు మంచి రివ్యూలను కూడా అందుకుంది. అయితే, ఈ ట్ 2022 మోడల్ అని గుర్తుంచుకోండి.