Flipkart New Year Big Deal on latest 55 inch 4K Smart Tv
New Year Big Deal: కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన బిగ్ డీల్ తో కేవలం 21 వేల ధరలో 55 ఇంచ్ 4K Smart Tv అందుకోవచ్చు. ఈ టీవీ మంచి స్లీక్ డిజైన్, డాల్బీ ఆడియో మరియు 32 జీబీ బిగ్ స్టోరేజ్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. చవక ధరలో కొత్త టీవీ కొనాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉంటే, ఫ్లిప్ కార్ట్ కొత్త సంవత్సరంలో అందించిన ఈ బిగ్ డీల్ పై ఒక లుక్కేయండి.
కొత్త సంవత్సరం ప్రారంభం అవుతునే ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. Coocaa ఇండియన్ మార్కెట్లో గత సంవత్సరం విడుదల చేసిన Y74 Plus సిరీస్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్ ని అందించింది. ఈ రోజు ఈ టీవీ పై 58% భారీ డిస్కౌంట్ అందించి రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ టీవీ పై HDFC మరియు BOB CARD EMI రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 21,499 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది.
Also Read: నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా Sony Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!
ఈ కూకా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మంచి LED ప్యానల్ తో వాస్తుంది మరియు ఈ ప్యానల్ 60Hz రిఫెర్స్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ టీవీ స్క్రీన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది 4K UHD (3840 x 2160) రిజల్యూషన్, HDR 10 మరియు HLG సపోర్ట్ తో ఉంటుంది మరియు మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది.ఈ కూకా 55 ఇంచ్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ వేగంగా పని చేయడానికి వీలుగా ఇందులో 2 జీబీ ర్యామ్ మరియు గొప్ప 32 జీబీ స్టోరేజ్ కూడా కూకా ఈ టీవీ లో అందించింది.
స్క్రీన్ వివరాలు చూసాము, ఇప్పుడు సౌండ్ ఫీచర్స్ చూద్దాం. ఈ టీవీ రెండు బిల్ట్ ఇన్ బాక్స్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ కలిగిన రెండు స్పీకర్లతో టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి మంచి సరౌండ్ సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇక ఈ టీవీ కలిగిన కనెక్టివిటీ సపోర్ట్ విషయానికి వస్తే, ఇందులో ఈథర్నెట్, HDMI, AV, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ తో సహా పూర్తి కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.