Flipkart GOAT sale offers big deals on these Samsung Smart Tvs
Flipkart GOAT sale రేపు అర్ధరాత్రి తో ముగుస్తుంది. అందుకే, ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ నుంచి స్మార్ట్ టీవీ ల పైన గొప్ప ఆఫర్లను అనౌన్స్ చేసింది. ముఖ్యంగా, స్మార్ట్ టీవీ దిగ్గజం శాంసంగ్ బ్రాండ్ యొక్క స్మార్ట్ టీవీ ల పైన గొప్ప ఆఫర్లను అందించింది. అందుకే, ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ నుంచి ఈరోజు అందించిన బెస్ట్ Samsung Smart Tv డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం. శాంసంగ్ పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ ని 30 వేల కంటే తక్కువ ధరలో కొనాలని చూస్తున్న వారు ఇక్కడ అందించిన ఆఫర్లను పరిశీలించవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ నుంచి ఈరోజు చాలా శాంసంగ్ స్మార్ట్ టీవీలు మంచి ఆఫర్ ధరకే లభిస్తున్నాయి. వీటిలో మంచి డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
ఆఫర్ ధర : రూ. 28,990
క్రిస్టల్ 4K ఐస్మార్ట్ సిరీస్ యొక్క ఈ 43 ఇంచ్ శాంసంగ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్‌కార్ట్ సేల్ నుంచి 45% డిస్కౌంట్ తో రూ. 28,990 ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Axis, HDFC మరియు IDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,500 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ శాంసంగ్ పెద్ద 4K UHD స్మార్ట్ టీవీ Tizen OS పై పని చేస్తుంది. ఈటీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ లో మోషన్ యాక్సిలరేటర్ మరియు OTS lite ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ HDMI, USB, బ్లూటూత్ మరియు Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ 20W అవుట్ ఫుట్ అందించే స్పీకర్లు, Q-Symphony మరియు 3D సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది.
Also Read: HMD Crest: కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు సొంత బ్రాండ్ తో లాంచ్ చేస్తున్న Nokia యాజమాన్య కంపెనీ.!
ఆఫర్ ధర : రూ. 29,490
ఈ శాంసంగ్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్‌కార్ట్ సేల్ నుంచి 38% డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన కూడా Axis, HDFC మరియు IDFC బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ శాంసంగ్ 4K UHD స్మార్ట్ టీవీ Wi-Fi, HDMI, USB మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ టీవీ HDR 10+ మరియు క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Digital Plus మరియు అడాప్టివ్ సౌండ్ ఫీచర్ లతో గొప్ప సౌండ్ అందిస్తుంది.