flipkart End Of Season Sale last day best 50 inch QLED Smart TV deal
ఫ్లిప్ కార్ట్ ఇటీవల అందించిన లేటెస్ట్ సేల్ End Of Season Sale ఈరోజు తో ముగుస్తుంది. అందుకే, ఈ చివరి రోజు అందించిన బిగ్ డిస్కౌంట్ దెబ్బకి 20 వేలకే 50 ఇంచ్ QLED Smart TV లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో గొప్ప విజువల్స్ కూడా అందిస్తుంది.
జర్మన్ ఆడియో దిగ్గజం Blaupunkt ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన JioTele OS స్మార్ట్ టీవీ సిరీస్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 45% డిస్కౌంట్ తో రూ. 21,999 లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ పై BOB CARD EMI, HDFC మరియు HSBC క్రెడిట్ కార్డు పై 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని మీరు కేవలం రూ. 20,499 రూపాయల అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగిన బిగ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ ప్యానల్ 450 నిట్స్ బ్రైట్నెస్, 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ టీవీ JioTele OS ఇంటిగ్రేటెడ్ ఆపరేటింగ్ సిస్టం తో స్మార్ట్ ఇంటరాక్టివ్ UI అందిస్తుంది. అలాగే, గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ తో Netflix, Prime Video, YouTube, Disney+ Hotstar వంటి ప్రముఖ OTT యాప్స్ ను డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ టీవీ సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ 2 స్పీకర్లతో టోటల్ 48W సౌండ్ ఔట్ పుట్ ఆఫర్ సెహెస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది కాబట్టి గొప్ప సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. అంటే, ఇందులో మంచి విజువల్స్ కి తగిన బెస్ట్ సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది.
Also Read: Redmi Note 15 : లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్లు కూడా రివీల్ చేసింది.!
కనెక్టివిటీ పరంగా, ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ లో HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ వంటి అన్ని ఆధునిక కనెక్షన్ ఆప్షన్లు ఉన్నాయి వీటితో మీరు మీ ల్యాప్ టాప్, మొబైల్, గేమింగ్ కన్సోల్ లేదా ఇతర డివైస్ లను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ టీవీ అన్ని భారతీయ లాంగ్వేజ్ లకు సపోర్ట్ చేస్తుంది.