Flipkart Buy Buy 2025 Sale offers big discount on 43 inch 4K Smart TV
Flipkart Buy Buy 2025 Sale మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. ఈ నెల 5వ తేదీ నుంచి మొదలైన ఈ సేల్ డిసెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి ముగుస్తుంది. ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ మరియు ఆఫర్లు ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ సేల్ నుంచి అందించిన డీల్స్ లో బెస్ట్ డీల్ గురించి ఈరోజు మీకు వివరాలు అందిస్తున్నాము. అదేమిటంటే, భారీ డిస్కౌంట్ తో కేవలం 15 వేల ధరలో లభిస్తున్న 43 ఇంచ్ 4K Smart TV డీల్. చవక ధరలో బ్రాండ్ న్యూ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
ఫ్లిప్ కార్ట్ యొక్క లేటెస్ట్ సేల్ బై బై 2025 సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది. ఐఫాల్కన్ యొక్క 43 ఇంచ్ స్మార్ట్ టీవీ (43U65) పై ఈ డీల్ అందించింది. ఈరోజు ఈ టీవీ పై 66% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.
ఇదే కాదు ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,250 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ మరియు SBI కు క్రెడిట్ కార్డ్ రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 15,999 రూపాయల కంటే తక్కువ ధరలోనే మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: రేపు విడుదల కానున్న Poco C85 5G టాప్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ 4K UHD రిజల్యూషన్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్, HDR 10 మరియు డైనమిక్ కలర్ నైపుణ్యం వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఇందులో క్వాడ్ కోర్ ప్రోసెసర్ ఉంటుంది మరియు దీనికి జతగా 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్ ఉంటుంది. అంటే, ఇది వేగంగా రెస్పాన్స్ అవ్వడానికి మరియు మరిన్ని యాప్స్ స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ లో ఇంటిగ్రేటెడ్ స్పీకర్ బాక్స్ సిస్టం ఉంటుంది మరియు ఈ టీవీ టోటల్ రెండు స్పీకర్లు కలిగి 24W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ కలిగిన డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో మరింత ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఆప్టికల్, HDMI, USB, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మీరు అందుకోవచ్చు.