Flipkart Big Diwali Sale started from today and offers big deals on lcd and led smart tvs
Flipkart Big Diwali Sale ఈరోజు నుంచి మొదలయ్యింది మరియు 2024 దీపావళి పండుగ కోసం తీసుకు వచ్చిన ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి మీ ఇంటికి తగిన పెద్ద Smart Tv ని చాలా చవక ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. చవక ధరలో కొత్త LED లేదా QLED స్మార్ట్ టీవీ కొనాలని ఎదురు చూస్తుంటే ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి.
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వ తేదీ వరకు జరుగుతుందని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు కేవలం 6 వేలకే LED టీవీని, 7 వేలకే QLED స్మార్ట్ టీవీని అందుకునే అవకాశం అందించింది. ఆ బెస్ట్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Daiwa యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి (D32H1COC) మోడల్ నెంబర్ 32 ఇంచ్ LED స్మార్ట్ టీవీ ఈరోజు 61% డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 రూపాయల ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 700 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ టీవీని కేవలం రూ. 6,299 ధరకే అందుకోవచ్చు.
Also Read: 3 వేల ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే Soundbar కోసం చూస్తున్నారా.!
అదే Daiwa బ్రాండ్ యొక్క 32 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (32G1Q) ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 69% డిస్కౌంట్ తో రూ. 7,999 ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ టీవీని SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, ఈ టీవీ ని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 7,199 రేటుకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ట్ గొప్ప విజువల్స్ అందిస్తుంది మరియు మంచి సౌండ్ కూడా అందిస్తుంది.