flipkart best offer best deals on Thomson 43 inch 4K QLED smart tv
పండుగ సీజన్ సేల్ నుంచి ఆఫర్ ధరలో స్మార్ట్ టీవీ కొనాలని ఎదురు చూసి కొనలేక పోయిన వారికి ఈ రోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ అందుబాటులో ఉంది. 17 వేల ఆఫర్ ధరకే బ్రాండెడ్ 43 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుకోవచ్చు. ఈ టీవీ మంచి ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి ఆఫర్ ధరలో కూడా లభిస్తుంది.
Thomson Phoenix సిరీస్ నుంచి విడుదల చేసిన లేటెస్ట్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 43% భారీ డిస్కౌంట్ తో రూ. 18,399 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి Flipkart Axis బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 919 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 17,479 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. మీ ఈ న్యూస్ అందించే సమయానికి కేవలం 4 టీవీలు మాత్రమే స్టాక్ లో ఉన్నాయి. కాబట్టి ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అని గమనించాలి.
ఈ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ థాంసన్ టీవీ డాల్బీ విజన్, HDR 10 మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ దాదాపు అంచులు లేని బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ కలిగిన సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ టోటల్ 40W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, బ్లూటూత్, AV ఇన్, ఈథర్నెట్, HDMI మరియు మరియు కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: మంచి డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న 200W డీప్ బాస్ Soundbar.!
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. ముఖ్యంగా, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది.