flipkart best big QLED Smart Tv deal today 28 may 2024
పెద్ద QLED Smart Tv ని తక్కువ ధరలో అందుకునే గొప్ప అవకాశం ఇప్పుడు మీ ముందుంది. 20 వేల రూపాయల లోపు పెద్ద స్మార్ట్ టీవీ, అది కూడా క్యూలెడ్ స్మార్ట్ టీవీ కొనాలనుకునే ఇది తగిన డీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ యెక్క లభిస్తుంది మరియు ఈ టీవీ ఫీచర్లు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలని ఉందా? అయితే, ఇంకెందుకు ఆలశ్యం తెలుసుకుందాం పదండి.
ప్రముఖ బ్రాండ్ Thomson యొక్క Phoenix సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్ గురించే మనం మాట్లాడుకుంటోంది. థాంసన్ ఫీనిక్స్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (Q43H1110) పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 34% డిస్కౌంట్ అందించింది. అందుకే ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 20,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
ఇంతటితో ఈ ఫోన్ ఆపిన అందించిన ఆఫర్లు అయిపోలేదు. ఈ స్మార్ట్ టీవీ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనేవారికి రూ. 2,000 రూపాయల భారీ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ అఫర్ తో ఈ టీవీ ని కేవలం రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే అవకాశం వుంది.
Also Read: Lava Yuva 5G: కొత్త చిప్ సెట్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!
ఈ థాంసన్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది. అలాగే, ఈ టీవీ లో Dolby Atmos మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ టెక్నలాజి సపోర్ట్ కూడా వుంది. అంటే, ఈ టీవీ గొప్ప విజువల్స్ మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కూడా వస్తుంది.
ఈ టీవీలో 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 40W సౌండ్ అందించే రెండు బాక్స్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ MT9602 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని పనిచేస్తుంది. ఈ టీవీ లో 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఈ ధర పరిధిలో ఈరోజు లభించే బెస్ట్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది.