15 వేలకే బ్రాండెడ్ 4K QLED Smart Tv ఆఫర్ చేస్తున్న Flipkart BBD Sale

Updated on 25-Sep-2025
HIGHLIGHTS

Flipkart BBD Sale ఈరోజు మూడో రోజుకు చేరుకుంది

Flipkart ఈరోజు ప్రత్యేకమైన స్మార్ట్ టీవీ ఆఫర్స్ అందించింది

15 వేల రూపాయల ధరకే బ్రాండెడ్ 43 ఇంచ్ 4K QLED Smart Tv ఆఫర్ చేస్తోంది

Flipkart BBD Sale ఈరోజు మూడో రోజుకు చేరుకుంది మరియు ఈరోజు ప్రత్యేకమైన స్మార్ట్ టీవీ ఆఫర్స్ అందించింది. ఈ సేల్ నుంచి ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ తో కేవలం 15 వేల రూపాయల ధరకే బ్రాండెడ్ 43 ఇంచ్ 4K QLED Smart Tv ఆఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కోసం చూసే యూజర్లు ఈ కొత్త టీవీ ఆఫర్ ను పరిశీలించవచ్చు.

Flipkart BBD Sale 4K QLED Smart Tv : ఆఫర్

Thomson ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన JioTele OS టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ ఆఫర్ చేసింది. ఈ టీవీ ఇండియాలో రూ. 18,999 ధరతో ఇటీవల విడుదల అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అందించిన రూ. 2,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 16,999 రూపాయల అతి తక్కువ ధరకు సేల్ అవుతోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ ఫోన్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీని Axis మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 15,499 రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ ప్రైస్ లో గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: Samsung Galaxy A35 5G ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే సేల్ అవుతోంది.!

Thomson (43) 4K QLED Smart Tv : ఫీచర్స్

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 60Hz మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR సపోర్ట్ మరియు VIVID కలర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Jio Tele OS తో నడుస్తుంది మరియు అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ AI-driven కంటెంట్ రికమండేషన్స్ కూడా ఆఫర్ చేస్తుంది.

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ వంటి చాలా లాంగ్వేజ్ లకు వాయిస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :