Flipkart BBD Sale లాస్ట్ డే 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart Tv డీల్ అందించింది.!

Updated on 01-Oct-2025
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన పండుగ సేల్ Flipkart BBD Sale చివరి దశకు చేరుకుంది

ఈ పండుగ సేల్ రేపు అర్ధరాత్రి తో ముగుస్తుందని ఫ్లిప్ కార్ట్ క్లోజింగ్ డేట్ అనౌన్స్ చేసింది

ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart Tv డీల్ అందించింది

2025 దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన పండుగ సేల్ Flipkart BBD Sale చివరి దశకు చేరుకుంది. ఈ పండుగ సేల్ రేపు అర్ధరాత్రి తో ముగుస్తుందని ఫ్లిప్ కార్ట్ క్లోజింగ్ డేట్ అనౌన్స్ చేసింది. అందుకే కాబోలు చివరి రోజుల్లో అద్భుతమైన స్మార్ట్ టీవీ ఆఫర్లు కూడా అందించింది. రేపటితో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart Tv డీల్ అందించింది. మీ ఇంటికి తగిన పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ పరిశీలించవచ్చు.

Flipkart BBD Sale 4K Smart Tv డీల్

ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ని అందించింది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ టిసిఎల్ యొక్క ఉప బ్రాండ్ ఐఫాల్కన్ యొక్క లేటెస్ట్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ (65U65) పై ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ 71% భారీ డిస్కౌంట్ తో Rs. 34,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ బిగ్ టీవీని Axis మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించిన ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 33,499 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ సేల్ అక్టోబర్ 2వ తేదీ అర్ధరాత్రి తో ముగుస్తుంది కాబట్టి ఈ డీల్ అప్పటి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read: Samsung Galaxy A55 5G అమెజాన్ సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తోంది.!

iFFALCON (65) 4K Smart Tv : ఫీచర్స్

ఈ ఐఫాల్కన్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది డాల్బీ విజన్, HDR 10 మరియు డైనమిక్ కలర్ ఎన్ హెన్మెంట్ ఫీచర్స్ తో మంచి విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ గూగుల్ టీవీ OS తో నడుస్తుంది మరియు మల్టీ ఐ కేర్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ పరంగా ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఈ టీవీ టోటల్ 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్, HDMI, USB, AV ఇన్ మరియు మరిన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :