Flipkart BBD Sale best QLED Smart Tv deals under rs 20000 today
Flipkart BBD Sale నుంచి ఈరోజు గొప్ప QLED Smart Tv డీల్స్ ను ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ప్రకటించిన ఈ ఆఫర్స్ తో 20 వేల కంటే తక్కువ ధరలో లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీని అందుకునే అవకాశం వుంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ పండుగ సేల్ నుండి కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ రోజు మేము అందిస్తున్న ఈ బెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్స్ పై ఒక లుక్కేయండి.
ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు చాలా డీల్స్ అందించింది. అయితే, థాంసన్ మరియు బ్లౌపంక్ట్ అందించిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీలు మాత్రం మంచి డిస్కౌంట్ తో 20 ధరలో లభిస్తున్నాయి. ఈ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
ఆఫర్ ధర : రూ. 18,999
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 19,999 ధరకు లిస్ట్ అయ్యింది. ఈ టీవీని Debit/Credit కార్డ్ ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీ ని రూ. 18,999 ధరకి పొందవచ్చు. ఈ థాంసన్ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision సపోర్ట్ తో గొప్ప విజువల్స్ మరియు Dolby Atmos తో మంచి సౌండ్ అందిస్తుంది.
Also Read: Jio Plans: జియో యూజర్లకు అన్లిమిటెడ్ లాభాలను చవక ధరలో అందించే బెస్ట్ ప్లాన్స్.!
ఆఫర్ ధర : రూ. 18,499
ప్రముఖ జర్మన్ కంపెనీ బ్లౌపంక్ట్ అందించిన ఈ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ మరియు 50W హెవీ సౌండ్ అందించే స్పీకర్లు మరియు Dolby Digital Plus సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీలో గొప్ప సౌండ్ మరియు విజువల్స్ ను పొందవచ్చు. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 38% డిస్కౌంట్ తో రూ. 20,999 ధరకు లభిస్తుంది మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో రూ. 1,500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని రూ. 18,499 ధరకి పొందవచ్చు.