Flipkart BBD Sale best 43 inch and 55 inch smart tv deals
Flipkart BBD Sale నుంచి ఈరోజు గొప్ప Smart Tv డీల్స్ అందించింది. 2025 పండుగ సీజన్ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది. అసలే పండగ సీజన్ అందులోనూ తగ్గిన GST రేట్లు వెరసి స్మార్ట్ టీవీ ధరలు అమాంతం తగ్గించాయి. అందుకే, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఇంత చవక ధరకే స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ తో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 15 వేలకే 43 ఇంచ్ టీవీ మరియు 20 వేలకే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నుంచి ఈరోజు ఇన్ఫినిక్స్ మరియు మోటోరోలా స్మార్ట్ టీవీలు చాలా చౌక ధరలో లభిస్తున్నాయి. ఈ టీవీ డీల్స్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ తో 15 వేలకే 43 ఇంచ్ మరియు 23 వేలకే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లభిస్తున్నాయి. ఈ డీల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇన్ఫినిక్స్ యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (43GU3Q) ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 5,000 డిస్కౌంట్ అందుకుని రూ. 16,999 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ టీవీని ICICI క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 15,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ టీవీ 43 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ ను 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ తో సహా కంప్లీట్ కనెక్టివిటీ మరియు డాల్బీ ఆడియో వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. చవక ధరలో పెద్ద 4K స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి బడ్జెట్ ఆప్షన్ అవుతుంది.
Also Read: ZEBRONICS 5.2.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 15 వేలకే లభిస్తోంది.!
మోటోరోలా యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (55UHDGDMBSXP) ఈరోజు 51% భారీ డిస్కౌంట్ తో రూ. 25,499 ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ టీవీని ICICI క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనేవారికి రూ. 1,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్, 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్, క్వాడ్ కోర్ ప్రోసెసర్, గూగుల్ టీవీ OS, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో సహా కంప్లీట్ కనెక్టివిటీ వంటి అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.