Digit Zero1 అవార్డ్స్ 2018: ఉత్తమ 4K HDR TV కోసం నామినేషన్లు

Updated on 24-Nov-2018
HIGHLIGHTS

Zero1 అవార్డ్స్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ యొక్క ప్రతి విభాగంలో ఉత్తమ పనితీరును గుర్తిస్తుంది. ఇక్కడ 2018 యొక్క ఉత్తమ ప్రదర్శన ప్రధాన టెలివిజన్ కోసం ప్రతిపాదనలు.

గత 17 సంవత్సరాలుగా, జీరో 1 అవార్డులతో వినియోగదారు ఎలక్ట్రానిక్లలో అత్యుత్తమమైనదిగా గుర్తింపు పొందింది. వాటి పనితీరు పరంగా, పూర్తిగా ఉత్తమమైనవి, మరియు మీరు  కొనుగోలుచేయడానికి పరిగణలోకి తీసుకోవాల్సిన వాటిని గుర్తించే ప్రయత్నంలో, ఈ సంవత్సరపు ఉత్తమ పెరఫార్మెన్స్ గాడ్జెట్లకు డిజిట్ యొక్క Zero1 అవార్డులు ఇవ్వబడతాయి.

2018 సంవత్సరంలో, ఎన్నో కంపెనీల అనేకరకాల TVలు  మార్కెట్లోకి విడుదలచేయబడ్డాయి, అయితే  ఫిచర్ల కోసం ఒక బెంచ్మార్కును సెట్ చేసాము. మనము  ఇప్పుడు 2018 చివరిలో ఉన్నాము మరియు సంవత్సరం ప్రారంభంలో అంచనా వేయబడినవి  చాలా కూడా పాస్ అయ్యాయని చెప్పడానికి  మేము సంతోషంగా ఉన్నాము.  ఇప్పుడు మేనము మూడవ తరం OLED  టివిలతో ఉన్నాము మరియు మీ టీవీ నుండి మీ స్మార్ట్ గాడ్జెట్లను నియంత్రించవచ్చు.  భారతదేశంలో,  బడ్జెట్ ధరలో లభించే 4K TV లను ప్రారంభించిన బ్రాండ్ల సంఖ్య పెరుగుతునట్లు మరియు రిచ్ కోసం ప్రత్యేకించబడని లక్షణాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా మేము గమనించాము. ఈ నామినేషన్లలోని టీవీలు,  అసాధారణమైన చిత్ర నాణ్యతను, ఆకట్టుకునే స్మార్ట్ ఫీచర్లు మరియు టీవీని గోడపైన ఒక నల్ల అద్దంలా కాకుండా మీ ఇల్లులో అద్భుతమైన ఒక రూపాన్ని అందిస్తాయి.

ఈ సంవత్సరంలో చాల గొప్ప బ్రాండ్ల నుండి మంచి టీవీలు మార్కెట్లోకి వచ్చినట్లు చూసాము. అయితే వాటిలో, పెరఫార్మెన్సు ప్రకారంగా మీరు చెల్లించే డబ్బుకు  సరిపడా విలువనిచ్చే విధంగా మాతీర్పుకు నిలచిన టీవీలు ఇవిగో!

ఉత్తమ టీవీ నామినేషన్లు

సోనీ A9 F

సోనీ యొక్క మాస్టర్ సీరీసులో భాగంగా, ఈ A9F ఇతర OLED TV లతో పోలిస్తే మెరుగైన ధ్వనితో, బాక్స్ నుండి బయటకువస్తూనే Android 8 TV, మీ హోమ్ థియేటర్ సెటప్పులో ఈ టీవీని సెంటర్ స్పీకరుగా ఉపయోగించుకోవచ్చు మరియు లైవ్ లైఫ్ తో మీ యొక్క అన్ని స్మార్ట్ ఉపకరణాలను నియంత్రించవచ్చు ఏ టీవీతో. ఈ టీవీ HDR 10 మరియు డాల్బీ విజన్ మద్దతుతో 4K  రిజల్యూషన్ కలిగిఉంది. ఇది వాయిస్ రిమోట్ నియంత్రణతో, UI ని ఉపయోగించడానికి సులభమైనది. ఆడియో కోసం ఇది రెండవ తరం ధ్వని ఉపరితలం కలిగి ఉంటుంది.

సోనీ A8 F

సోనీ నుండి మరొక  ఉత్తమ టీవీ ఈ A8F. ఇది గత సంవత్సరం వచ్చిన A1ని కొత్త బాడీతో ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇది అచ్చంగా అదే OLED డిస్ప్లే కలిగి ఉంటుంది, అలాగే అదే సౌండ్  కలిగి ఉంటుంది కానీ  సరికొత్త రూపకల్పనతో వస్తుంది. ఇది ఒక గొప్ప ఉత్పత్తిగా  పరిగణించవచ్చు మరియు ఇది మరింత మెరుగ్గా చేయబడింది.

LG C8 OLED

LG యొక్క ఈ C8 OLED TV అనేది HDR 10 మరియు డాల్బీ విజన్లకు మద్దతు అందించగల 4K టీవీ. ఇది కూడా LG యొక్క వెబ్OS మరియు AI సామర్థ్యాలను  కలిగి ఉంటుంది. ఈ LED టీవీ సొగసైన డిజైన్, 4 HDMI 2.0 సామర్ధ్యం కలిగిన పోర్టులు మరియు పిక్చర్ ప్రీసెట్లు తో వస్తుంది.

పానాసోనిక్ FX 800D

ఈ పానాసోనిక్ FX 800D ఒక IPS ప్యానెలతో మంచి వీక్షణ కోణాలు, ఒక సన్నని డిజైన్ మరియు 4K తో పాటు  HDR10 కి మద్దతు ఇస్తుంది. ఈ TV కూడా లోకల్ డిమ్మింగుతో మీకు డీప్ బ్లాక్ మరియు మొత్తంగా గొప్ప విజువల్ అందిస్తుంది.

TCL 65-అంగుళాల QLED టీవీ

QLED అనేది శామ్సంగ్ TV లలో ఎక్కువగా కనిపించే ఒక టెక్నాలజీ, అయినప్పటికీ మనకు ఈ TCL TV 4K మరియు HDR మద్దతుతో Android TDP లో నడిచేటువంటి టీవీ కూడా ఉంది. ఈ టీవీ, Android TV లో నడుస్తుంది ఇది ఒక మంచి విషయం. ఈ టీవీలో 65-అంగుళాల ప్యానెల్ వుంది, ఈ జాబితాలో మిగిలిన పోటీదారులు 55-అంగుళాల వైవిధ్యాలు మాత్రమే. స్పష్టంగా చెప్పాలంటే, ఇతరవాటిలో కూడా 65 అంగుళాలు అందుబాటులో ఉన్నాయి, కానీ మేము 55 అంగుళాల వాటిని పరీక్షించాము వాటి ధరలను దృష్టిలో ఉంచుకొని.

iFFALCON 75H2A

ఒకవేళ పరిమాణం అవసరమైతే, మనకు iFFALCON 75H2A ఉంటుంది. ఈ LED TV కూడా Android తో నడుస్తుంది, 4K యొక్క శక్తితో ఉంటుంది మరియు పరీక్ష కోసం, మేము 75 అంగుళాల వేరియంటుని పరిశీలించాము .

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :