Price Hike effect BSNL Reaches 501 4G Sites in Karnataka Under 4G Saturation
BSNL: జూలై 3 నుంచి ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ రేట్లు పెరిగాయి. కొత్త టారిఫ్ ప్లాన్ లతో జేబుకు చిల్లు పడుతుందని యూజర్ల వాపోతున్నారు. అయితే, ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ మాత్రం చాలా తక్కువ రేట్లకే తన రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. అందుకే, బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు వాటి ప్రయోజనాల పైన ఒక లుక్కేద్దామా.
బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అధిక ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. ఇందులో, రూ. 249, రూ. 397 మరియు రూ. 1198 ప్రీపెయిడ్ ప్లాన్స్ బెస్ట్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఎందుకంటే, ఈ ప్లాన్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందిస్తాయి.
ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ను 45 రోజుల పాటు ఆనందించవచ్చు.
ఈ ప్లాన్ 150 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది మరియు చవక ధరలో ఎక్కువ రోజులు చెల్లుబాటు అయ్యే ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు డైలీ 100 SMS లను అందిస్తుంది. అయితే, పైన తెలిపిన కాలింగ్ మరియు డైలీ డేటా లాభాలు కేవలం 30 రోజులు మాత్రమే అందుతాయి. కానీ, ఈ ప్లాన్ 150 రోజులు చెల్లుబాటు అవుతుంది.
Also Read: Oppo Reno 12 Series స్మార్ట్ ఫోన్ జూలై 12న AI సపోర్ట్ తో లాంచ్ చేస్తోంది.!
ఈ రూ. 1198 ప్రీపెయిడ్ ప్లాన్ కి మరో పోటీ లేదనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ప్లాన్ పూర్తిగా 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. చవక ధరలో సంవత్సరం మొత్తం కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలను ఈ ప్లాన్ తో పొందవచ్చు. ఈ ప్లాన్ నెల వారి లిమిటెడ్ ప్రయోజనాలతో 12 నెలలకు అందించబడుతుంది.
అంటే, ఈ ప్లాన్ తో నెలకు 300 నిముషాల కాలింగ్ మినిట్స్, 3GB డేటా మరియు 30 SMS ల చొప్పున 12 నెలల పాటు (365 రోజులు) అందించబడతాయి.
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రేట్లు మరియు అవి ఆఫర్ చేసే ప్రయోజనాలు పరిశీలిస్తే ఎక్కడ పోటీ లేని విధంగా ఉంటాయి.
మొబైల్ రీఛార్జ్ కోసం Click Here