Blaupunkt launches five qled smart tvs from Blaupunkt Quantum Dot series
Blaupunkt Quantum Dot సిరీస్ నుంచి ఈరోజు ఐదు కొత్త QLED స్మార్ట్ టీవీలు విడుదల చేసింది, ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ టీవీలకు పెరుగుతున్న ఆదరణ మరియు పెరుగుతున్న స్మార్ట్ టీవీ వినియోగం దృష్టిలో ఉంచుకొని ప్రముఖ జర్మన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బ్లౌపంక్ట్ ఈ కొత్త స్మార్ట్ టీవీలు తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ టీవీలు 32 ఇంచ్ మొదలుకొని 65 ఇంచ్ వరకు అందించింది, ఇందులో, HD Ready, FHD మరియు 4K UHD రిజల్యూషన్ లో టీవీలు అందించింది.
పైన తెలిపిన విధంగా బ్లౌపంక్ట్ ఈ టీవీ లను 32 ఇంచ్ HDR మొదలుకొని 65 ఇంచ్ 4K UHD వరకు టీవీలు అందించింది. అయితే, ఈ సిరీస్ నుంచి విడుదల చేసిన కొత్త స్మార్ట్ టీవీలు మార్కెట్లో కొనసాగుతున్న చాలా టీవీలకు పోటీగా నిలిచేలా అందించింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ ప్రైస్ ఇక్కడ చూడవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ లతో గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ టీవీ లపై SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తెచ్చింది.
Also Read: Realme Narzo 80 Lite : లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు అనౌన్స్ చేసిన రియల్ మీ.!
బ్లౌపంక్ట్ 32 ఇంచ్ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో, 40 ఇంచ్ FHD రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ టీవీ కలిగి ఉంటాయి. అయితే, 50 ఇంచ్, 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ స్మార్ట్ టీవీలు 4K UHD రిజల్యూషన్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటాయి. అయితే, ఈ అన్ని టీవీలు కూడా AI PQ క్వాడ్ కోర్ చిప్ సెట్ కలిగి ఉంటాయి. 32 ఇంచ్ టీవీ మరియు 40 ఇంచ్ టీవీలు 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి. అయితే, 50, 55 మరియు 65 ఇంచ్ స్మార్ట్ టీవీలు 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి.
ఈ స్మార్ట్ టీవీలు HDR10 మరియు వైడ్ కలర్ గాముట్ తో మంచి విజువల్స్ అందిస్తాయని బ్లౌపంక్ట్ చెబుతోంది. ఈ కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీలు Dolby Atmos మరియు Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తాయని కంపెనీ వెల్లడించింది. అయితే, 32 మరియు 40 ఇంచ్ టీవీలు 48W సౌండ్ అవుట్ పుట్ కలిగి ఉంటే, 50 ఇంచ్ టీవీ 50W సౌండ్ అందిస్తుంది. కానీ, 55 ఇంచ్ మరియు 65 ఇంచ్ స్మార్ట్ టీవీలు నాలుగు స్పీకర్లు కలిగి టోటల్ 70W హెవీ సౌండ్ అందించే సత్తా కలిగి ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
కనెక్టివిటీ పరంగా, ఈ ఐదు స్మార్ట్ టీవీలు కూడా ఇన్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.