best budget 55 inch smart tv deal under 25k in india
చాలా చవక ధరలో 55 ఇంచ్ Smart Tv ఆఫర్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు మీకోసం గొప్ప 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఒకటి అందుబాటులో వుంది. ఈ ఆఫర్ మీకు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ అందించే స్క్రీన్ తో పాటు గొప్ప సౌండ్ అందించే సెటప్ ను కూడా కలిగి ఉంటుంది. మరి ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
TCL సబ్ బ్రాండ్ ఐఫాల్కన్ అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (iFF55U64) ఈ ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 64% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 25,999 రూపాయల ఆఫర్ రేటుకే లభిస్తుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది.
ఈ 55 ఇంచ్ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీని BOBCARD మరియు HSBC క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ . 24,499 రూపాయల అతి తక్కువ రేటుకు లభిస్తుంది.
Also Read: Ghibli లాంటి కార్టూన్ ఫోటోలు ఉచితంగా క్రియేట్ చేసుకోండి..!
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్, 4K రిజల్యూషన్ మరియు డైనమిక్ కలర్ ఎన్ హెన్స్మెంట్ సపోర్ట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 మంచి మంచి కాంట్రాస్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ బాక్స్ స్పీకర్లు కలిగి 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ 55 ఇంచ్ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీలో HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ WiFi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది.