Amazon Summer Sale టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ రివీల్ చేసిన అమెజాన్.!

Updated on 28-Apr-2025
HIGHLIGHTS

Amazon Summer Sale ప్రకటించిన అమెజాన్ ఇండియా

అమెజాన్ అప్ కమింగ్ సేల్ ముందస్తు ఆఫర్లు ఈరోజు అనౌన్స్ చేసింది

Sony, LG, TCL మరియు Samsung వంటి బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీల పై భారీ డీల్స్

Amazon Summer Sale మొదలు కావడానికి ఇంకా సమయం ఉండగా, అమెజాన్ మాత్రం అప్ కమింగ్ సేల్ ముందస్తు ఆఫర్లు ఈరోజు అనౌన్స్ చేసింది. అమెజాన్ ప్రకటించిన ఈ స్మార్ట్ టీవీ డీల్స్ లో Sony, LG, TCL మరియు Samsung వంటి బ్రాండ్స్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీలు ఉన్నాయి. అమెజాన్ సమ్మర్ సేల్ నుంచి ముందే అందించిన బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఈరోజు చూద్దాం.

Amazon Summer Sale: స్మార్ట్ టీవీ డీల్స్

అమెజాన్ సమ్మర్ సేల్ నుంచి నాలుగు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ముందే ప్రకటించింది. ఇందులో సోనీ, శామ్సంగ్, LG మరియు TCL స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఈ టీవీలను అమెజాన్ సమ్మర్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.

ఏమిటా స్మార్ట్ టీవీ డీల్స్?

అమెజాన్ సమ్మర్ సేల్ నుంచి సోనీ బ్రావియా 2 సిరీస్ స్మార్ట్ టీవీ లపై గొప్ప డీల్స్ అందించబోతున్నట్లు అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఇదేకాదు శామ్సంగ్ క్రిస్టల్ 4K సిరీస్ స్మార్ట్ టీవీలు, TCL 75 ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ మరియు LG లేటెస్ట్ 4K UHD స్మార్ట్ టీవీ సిరీస్ పై కూడా గొప్ప డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.

సోనీ బ్రావియా 2 సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అమెజాన్ సమ్మర్ సేల్ నుంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కలిపి 36 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుందని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.

శామ్సంగ్ క్రిస్టల్ సిరీస్ స్మార్ట్ టీవీలను కూడా మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ తో అందుకోవచ్చని చెబుతోంది. ఈ సిరీస్ 43 ఇంచ్ టీవీని 30 వేల కంటే తక్కువ ధరలో, 55 ఇంచ్ స్మార్ట్ టీవీని 40 వేల కంటే తక్కువ ధరలో అందుకునే అవకాశం ఉందట. అలాగే, LG Web OS సిరీస్ స్మార్ట్ టీవీలను కూడా మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది.

Also Read: Samsung Galaxy S24 FE: 60 వేల రూపాయల ఫోన్ ను 35 వేలకే అందుకోండి.!

ఇక TCL స్మార్ట్ టీవీ డీల్ విషయానికి వస్తే, TCL యొక్క 75 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 75P71B Pro డీల్ ను అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ 73% భారీ డిస్కౌంట్ తో రూ. 69,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 67,490 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.

అమెజాన్ సమ్మర్ సేల్ నుంచి లభించే మరిన్ని ఆఫర్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :