amazon offers latest lumio QLED Smart Tv
అమెజాన్ ఇండియా రోజు లేటెస్ట్ QLED Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Lumio ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గా విడుదల చేసిన టాప్ రేటెడ్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న గొప్ప డీల్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు చాలా చవక ధరలో లభిస్తుంది.
లుమియా బ్రాండ్ ఇటీవల విడుదల చేసిన 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ FTW1-ADSG పై 29% డిస్కౌంట్ అందించి కేవలం రూ. 28,999 రూపాయల ఆఫర్ ధరలో అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 26,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ పై నో కాస్ట్ EMI ఆఫర్ మరియు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ మరింత చవక ధరలో లభిస్తుంది. Bye From Here
Also Read: Bose Mini Soundbar భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించిన అమెజాన్.!
ఈ లూమియా 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ లూమియా టీవీ డాల్బీ విజన్, HDR 10, మరియు HLG వంటి ఫీచర్స్ తో గొప్ప సినిమా అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీ BOSS Processor ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ 3GB DDR4 RAM మరియు 16GB స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ లూమియా స్మార్ట్ టీవీ క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగి టోటల్ 24W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ లో డాల్బీ అట్మాస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ ఉంది. ఇక ఈ స్మార్ట్ టీవీ కలిగిన కనెక్టివిటీ సపోర్ట్ విషయానికి వస్తే, ఇందులో HDMI, USB, LAN, ఆప్టికల్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి పూర్తి కనెక్టివిటీ సపోర్ట్ ఉంటాయి.
ఈ స్మార్ట్ టీవీ 2 సంవత్సరాల వారెంటీ తో వస్తుంది. ఈ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.