Smart TV: ఈరోజు LG స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ ప్రకటించిన అమేజాన్.!

HIGHLIGHTS

LG యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ పైన ఈరోజు అమేజాన్ గ్రేట్ డీల్స్ ప్రకటించింది

4K స్మార్ట్ టీవీ ని చాలా తక్కువ ధరకే అందుకునే వీలుంది

అమెజాన్ అందించి ఈ LG స్మార్ట్ టీవీ డీల్ వివరాలు ఏమిటో చూద్దాం పదండి

Smart TV: ఈరోజు LG స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ ప్రకటించిన అమేజాన్.!

ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ అయిన LG యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ పైన ఈరోజు అమేజాన్ గ్రేట్ డీల్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లతో LG బ్రాండ్ యొక్క బిగ్ 4K స్మార్ట్ టీవీ ని చాలా తక్కువ ధరకే అందుకునే వీలుంది. ఈ స్మార్ట్ టీవీ మంచి డిస్ప్లే, ప్రోసెసర్ మరియు సౌండ్ టెక్నాలజీతో ఆకట్టుకుంటుంది. అమెజాన్ అందించి ఈ LG స్మార్ట్ టీవీ డీల్ వివరాలు ఏమిటో చూద్దాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG ఇండియాలో అందించిన 4K UHD Smart టీవీ సిరీస్ UQ7500PSF యొక్క 43 ఇంచ్ మరియు 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ల పైన ఈ డీల్స్ ను అమెజాన్ అందించింది. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా అమెజాన్ నుండి బిగ్ కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే లభిస్తున్నాయి. 

ఈరోజు LG (43ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీ 39% డిస్కౌంట్ తో రూ. 30,490 ధరతో మరియు రూ. 2,000 కూపన్ అఫర్ తో లభిస్తుండగా,  LG (55ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీ 43% డిస్కౌంట్ తో రూ. 45,990 ధరతో మరియు రూ. 3,000 కూపన్ అఫర్ తో లభిస్తోంది. దీనితో పాటుగా 43 ఇంచ్ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేస్తే రూ. 1,250, 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy From Here

ఏమిటి ఈ LG స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు?

ఇక ఈ LG స్మార్ట్ టీవీల ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీలు α5 Gen5 AI Processor 4K తో Lg WebOS ఆపరేటింగ్ సిస్టం పైన పని చేస్తాయి. ఈ టీవీ లు HDR 10 Pro మరియు వర్చువల్ సరౌండ్ సౌండ్ 5.1 తో మంచి విజువల్స్ మరియు సౌండ్ ను అందించ గలవు. ఈ టీవీ అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లకు మద్దతు నిస్తుంది మరియు బిల్ట్ ఇన్ Alexa తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo