బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ Panasonic Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్.!

Updated on 11-Sep-2025
HIGHLIGHTS

Amazon GIF Sale 2025 సేల్ కంటే ముందే అమెజాన్ మెగా సేవింగ్ డేస్ సేల్ అందించింది

సేల్ నుంచి బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ కలిగిన Panasonic Smart Tv పై బిగ్ డీల్ అనౌన్స్ చేసింది

పానాసోనిక్ రీసెంట్ గా విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ డీల్స్ అందించింది

Amazon GIF Sale 2025 సేల్ కంటే ముందే అమెజాన్ మెగా సేవింగ్ డేస్ సేల్ అందించింది. ఈ సేల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ టీవీ లపై ప్రత్యేకమైన డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన సేల్ నుంచి బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ కలిగిన Panasonic Smart Tv పై ఈరోజు అమెజాన్ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ ను పరిశీలించవచ్చు.

Panasonic Smart Tv : డీల్

పానాసోనిక్ రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి పానాసోనిక్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ TH-50PX660DX ని 24% డిస్కౌంట్ తో రూ. 36,990 రూపాయల ప్రైస్ తో లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,000 కూపన్ ఆఫర్ మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.

పైన తెలిపిన రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 34,490 రూపాయల అతి తక్కువ ధరలో ఆఫర్ చేస్తోంది. అంటే, ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ మెగా సేవింగ్ డేస్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.

Panasonic Smart Tv : ఫీచర్స్

ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Hexa క్రోమా డ్రైవ్, HDR 10+, 4K కలర్ ఇంజిన్ మరియు 4K అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు చాలా ఆకర్షణీయమైన స్లీక్ డిజైన్ తో ఉంటుంది.

ఈ పానాసోనిక్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ ను Dolby Digital సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ స్మార్ట్ టీవీ మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. అయితే, ఈ టీవీ కేవలం 20W సౌండ్ అవుట్ పుట్ మాత్రమే అందిస్తుంది. ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, AV ఇన్, ఆప్టికల్ వంటి పోర్ట్స్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Amazon GIF Sale కంటే ముందే భారీ Dolby Soundbar డీల్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

ఇక ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ యూజర్లు ఇచ్చిన రేటింగ్ మరియు రివ్యూల విషయానికి వస్తే, ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీ 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. ఓవరాల్ గా ఈ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :