అమేజాన్ LED టీవీ డీల్స్ రేపటినుండి మొదలు

Updated on 13-Mar-2019
HIGHLIGHTS

OLED & QOLED టీవీల పైన దాదాపుగా 45% వరకు తగ్గింపును అందించనున్నట్లు చూపిస్తోంది.

త్వరలో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) సందర్భంగా LED టీవీల పైన అమేజాన్ ఇండియా గొప్ప ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ సేల్ మార్చి 14 అంటే రేపటి నుండి మొదలవుతుంది. ఇందులో భాగంగా, అన్ని ప్రధాన టీవీ బ్రాండ్స్ పైన గొప్ప డిస్కౌంట్లు మరియు మంచి ఆఫర్లను అందించనుంది.   Sony, LG, Panasonic, Mi మరియు ఇటువంటి అన్ని ప్రధాన బ్రాండ్స్ యొక్క టివిల పైన ఎక్స్చేంజ్ అఫర్ ని ప్రకటించింది. అమేజాన్ ఇండియా ఆన్లైన్ ప్లేట్ ఫారం పైన అందించిన ఒక ప్రత్యేక పేజీ పైన అందించిన వివరాల ప్రకారం, No Cost EMI, భారీ డిస్కౌంట్లు మరియు టీవీ ఎక్స్చేంజ్ పైన అత్యదికమైన తగ్గింపులు అందించనున్నట్లు కనబడుతోంది.

ముఖ్యంగా, Sony బ్రాండ్ టీవీల గొప్ప తగ్గింపులతో పాటుగా 25,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించండం చూస్తుంటే, కొనుగోలుధారులకి  ఈ సేల్ భారీగానే ప్రయోజనాలను చేకూర్చనున్నట్టు అనిపిస్తోంది. IPL సీజన్లో ఎప్పుడు కూడా టీవీల అమ్మకాలు జోరుగా సాగడం పరిపాటి. అయితే, ఈ ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఇప్పుడు దీని పైన మరింత ద్రుష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

అలాగే, ఇక్కడ అందించిన వెబ్ పేజీలో OLED & QOLED టీవీల పైన దాదాపుగా 45% వరకు తగ్గింపును అందించనున్నట్లు చూపిస్తోంది. Sanyo యొక్క 65 అంగుళాల 4K ఆండ్రాయిడ్ టీవీ ధరను Rs _5,_00 ధరతో చూపిస్తోంది.  ధరను 14 వ తేదీ ప్రకటించనుంది. అలాగే, Sony, LG, Panasonic, Mi వంటి మరికొన్ని బ్రాండెడ్ టీవీల ధరలను కూడా 14 వ తేదీ ఆవిష్కరించనున్నట్లు ప్రకటిస్తోంది.                                            

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :