Amazon GIF 2023: ధమాకా ఆఫర్లతో మొదలైన అమేజాన్ సేల్..ఈ Smart Tv Deal మూమూలుగా లేదుగా.!

Amazon GIF 2023: ధమాకా ఆఫర్లతో మొదలైన అమేజాన్ సేల్..ఈ Smart Tv Deal మూమూలుగా లేదుగా.!

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 ను ఈరోజు నుండి అందరికీ అందుబాటులోకి వచ్చింది. Amazon GIF 2023 సేల్ నుండి ధమాకా ఆఫర్లను అందించింది. ఇందులో మరి ముఖ్యంగా Xiaomi లేటెస్ట్ Smart Tv అందించిన Deal మాములుగా లేదు. Dolby Vision మరియు Dolby Audio సపోర్ట్ కలిగి మంచి ఫీచర్లతో వచ్చే బెస్ట్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో కేవలం 23 వేల కంటే తక్కువ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారు, ఈ Mi X Series 4K Ultra HD స్మార్ట్ టీవీ ఆఫర్ ను పరిగణలోకి తీసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GIF 2023 Sale Offer

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 మొదటి రోజైన ఈరోజు మిఎక్స్ సిరీస్ 4కె అల్ట్రా హై డెఫినేషన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీని 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 22,999 రూపాయల అఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనే వారికి రూ. 1,750 అదనపు డిస్కౌంట్ మరియు క్రెడిట్ కార్డ్ Non-EMI అప్షన్ తో కొనే వారికి రూ. 1,500 అధనపు డిస్కౌంట్ ను అమేజాన్ ఆఫర్ చేస్తోంది. Buy From Here

Also Read : Gold Rate: ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉందంటే | New Update

Mi X Series 4K Ultra HD Smart Tv

మి ఎక్స్ సిరీస్ 4కె అల్ట్రా హై డెఫినేషన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ Metal Bezel-less డిజైన్ తో వస్తుంది Dolby Vision, HDR10, HLG, Reality Flow MEMC మరియు Vivid Picture Engine సపోర్ట్ తో క్వాలిటీ పిక్చర్ ను అందిస్తుంది. అలాగే, 30 Watts స్పీకర్లను Dolby Audio మరియు DTS Virtual: X, DTS-HD టెక్నాలజీ సపోర్ట్ క్లైగి ఉండడంతో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది.

Mi Smart tv deal on Amazon GIF 2023 Sale
మి ఎక్స్ సిరీస్ 4కె అల్ట్రా హై డెఫినేషన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ

ఈ షియోమి స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఆప్టికల్, Ethernet మరియు 3.5mm జాక్ తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ Quad core A55 CPU ప్రోసెసర్ తో పని చేస్తుంది, 2GB RAM + 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo