Samsung 55 ఇంచ్ Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ డీల్స్ ప్రకటించిన అమెజాన్.!

Updated on 06-Nov-2025
HIGHLIGHTS

Samsung 55 ఇంచ్ Smart Tv పై ఈరోజు అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది

శాంసంగ్ యొక్క Crystal 4K Vista Pro సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ అందించింది

ఈ స్మార్ట్ టీవీ పై అందించిన ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరలో లభిస్తుంది

Samsung 55 ఇంచ్ Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. శాంసంగ్ యొక్క Crystal 4K Vista Pro సిరీస్ నుంచి అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై అందించిన ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ చాలా తక్కువ ధరలో లభిస్తుంది. బ్రాండెడ్ 4K 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ కోసం చూస్తున్న వారు ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన ఈ స్మార్ట్ టీవీ డీల్ పరిశీలించవచ్చు.

Samsung 55 inch Smart Tv : ఆఫర్

ఈ శాంసంగ్ క్రిస్టల్ 4K విస్తా ప్రో సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ UA55UE86AFULXL ఈరోజు అమెజాన్ 39% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 38,990 రూపాయల ఆఫర్ ప్రైస్ తో అమెజాన్ నుంచి లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,924 రూపాయల భారీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని Federal క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. మీరు కూడా ఈ కార్డు తో ఈ టీవీ తీసుకునే మీకు ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 36,066 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Open AI సూపర్ వీడియో జనరేటర్ యాప్ Sora ఆండ్రాయిడ్ యాప్ వచ్చేసింది.!

Samsung 55 inch Smart Tv : ఫీచర్స్

ఈ శాంసంగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో పని చేస్తుంది. ఇది ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీల కోసం తయారు చేసిన ప్రత్యేకమైన ప్రోసెసర్ మరియు ఇది ఈ టీవీని గొప్పగా నిర్వహిస్తుంది. ఇందులో 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ ఉంటుంది. ఇది HDR10+, పర్ కలర్ మరియు 4K అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ 3 HDMI (eARC), 1 USB, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ మరియు ఈథర్నెట్ పోర్ట్ వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Q-Symphony, అడాప్టివ్ సౌండ్ మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి మరియు ఈ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ 100+ ఉచిత చానల్స్ అందించే శాంసంగ్ టీవీ ప్లస్ తో వస్తుంది మరియు వాయిస్ అసిస్టెంట్ రిమోట్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :