amazon announced big offers on LG OLED smart tv
అమెజాన్ ఇండియా ఈరోజు LG OLED smart tv పై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇటీవల ముగిసిన పండుగ సీజన్ సేల్ తర్వాత అమెజాన్ ప్రకటించిన అతిభారీ స్మార్ట్ టీవీ ఆఫర్లలో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ LG స్మార్ట్ టీవీ పై ఈరోజు బ్యాంక్ డిస్కౌంట్ మరియు ప్రత్యేకమైన కూపన్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా అమెజాన్ అందించింది. కొత్త OLED స్మార్ట్ టీవీ కొనడానికి సెర్చ్ చేస్తున్న వారు ఈరోజు అమెజాన్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.
LG యొక్క 55 ఇంచ్ OLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55A3PSA పై ఈ ఆఫర్లను అమెజాన్ అందించింది. ఈ LG స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు 36% భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 89,990 రూపాయల ధరకు సేల్ అవుతోంది.
ఇక ఈ టీవీ పైన అందించిన ఇతర ఆఫర్ల విషయానికి వస్తే, ఈ టీవీ పై అమెజాన్ రూ. 5,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ టీవీ ప్రధాన బ్యాంక్ ల క్రెడిట్ కార్డ్ తో No Cost EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 9,035 రూపాయల వడ్డీ సేవింగ్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది.
ఓవరాల్ గా ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు గొప్ప డిస్కౌంట్ అందుకునే అవకాశం అమెజాన్ ఇండియా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Soundbar: బడ్జెట్ ధరలో డీసెంట్ సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్స్ ఇవే.!
ఈ ఎల్ జి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840×2160) రిజల్యూషన్ కలిగిన OLED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision iQ, HDR 10 మరియు α7 AI Processor 4K Gen6 ప్రోసెసర్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ Virtual 5.1.2 up-mix మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు బిల్ట్ ఇన్ స్టీరియో సరౌండ్ సౌండ్ ను కూడా కలిగి వుంది. HDMI, eARC, ఆప్టికల్, USB, బ్లూటూత్ 5.0 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.